చైతూకి ఆ రికార్డ్ సాధ్యమవుతుందా?

Purushottham Vinay
అక్కినేని వంశం మూడో తరం హీరో నాగ చైతన్య.. ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడనే చెప్పాలి. 'యుద్ధం శరణం' 'శైలజారెడ్డి అల్లుడు' 'సవ్యసాచి' వంటి సినిమాలతో వరుస డిజాస్టర్లను మూటకట్టుకున్న చైతన్య ఆ తర్వాత..'మజిలీ' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే 'వెంకీ మామ' అనే మల్టీ స్టారర్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కరోనా మహమ్మారి లాక్ డౌన్ ముగిసాక జనాలు అంతంత మాత్రంగానే థియేటర్లకు వస్తున్న క్రమంలో 'లవ్ స్టోరీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఆ సినిమా విడుదలయ్యే ముందు 'ఇది హిట్ అయినప్పటికీ సాయి పల్లవి ఇంకా అలాగే శేఖర్ కమ్ములకి మాత్రమే క్రెడిట్ పోతుంది' అని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాలో నాగ చైతన్య తన పెర్ఫార్మన్స్ అందరితోనూ క్లాప్స్ కొట్టించింది. బాక్సాఫీస్ వద్ద పైగా కరోనా విజృంభిస్తున్న ఆ టైములో రూ.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిన సినిమాగా 'లవ్ స్టోరీ' సినిమా రికార్డులు సృష్టించింది. ఆ సినిమాతో చైతన్య తన కెరీర్లో మొదటి హ్యాట్రిక్ హిట్ ను కంప్లీట్ చేసాడు.

ఇక తాజాగా సంక్రాంతి కానుకగా విడుదల అయినా 'బంగార్రాజు' సినిమా కూడా మంచి సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నాగ చైతన్యకి .. ఈ సినిమా మరింత ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకి చైతూ మరింత దగ్గరయ్యాడు. ఓ మీడియం రేంజ్ హీరో వరుసగా నాలుగు సార్లు రూ.50 కోట్ల(గ్రాస్) క్లబ్ లో చేరడం ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం.ఇక ఇప్పట్లో పెద్ద హీరోల సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి 'థాంక్యూ' సినిమా ఇంకా 'లాల్ సింగ్ చద్దా' సినిమాలతో కూడా చైతన్య హిట్లు కొడితే చైతూకి ఏ మీడియం హీరో రేంజ్ హీరోకి సాధ్యం కాని రికార్డు తన ఖాతాలో చేరుతుంది.ఇక వాటితో చైతూ బ్లాక్ బస్టర్ లు అందుకుంటే.. ఖచ్చితంగా పెద్ద స్టార్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: