జగన్ అందుకే సూపర్ హీరో అయ్యాడా?

Satvika
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య లు కలిసి నటించిన తాజా చిత్రం బంగార్రాజు..సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే విడుదల అయ్యిన కొద్ది రోజులకు 50 కోట్లు రాబట్టారూ, అంతేకాదు మంచి టాక్ ను కూడా అందుకోవడం తో సినిమా ఘన విజయాన్ని సాధిస్తారు. ఒకవైపు కరొన సమయం లో కూడా ఇలా మంచి వసూల్ లు సాధించడం గొప్ప విషయం కాదు..సినిమా హిట్ అవ్వడం తో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమ లో నాగ్ మాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి..

రాజమండ్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్ , నటుడు నారాయణమూర్తి తదితర వ్యక్తులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెస్తున్నారు. సినిమా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సొగ్గాడే చిన్ని నాయనాకు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.సినీ పరిశ్రమపై మంచిగా స్పందించిన జగన్‌కు నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై సినీ పరిశ్రమకు అన్నీ మంచి రోజులేనని చెప్పుకొచ్చారు నాగార్జున. ఎన్టీఆర్ , ఏఎన్నార్ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటి వారని చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వాళ్లిద్దరు జీవించే ఉంటారని బంగార్రాజు ఈ సందర్బంగా చెప్పారు.

అనంతరం ఆర్ నారాయణ మూర్తి మాట్లాడాడు.. కరోనా విజ్రుంభిస్తున్న నేపథ్యంలో సినిమాలను మూసి వెయ్యకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ సినిమాలను  ఆడించమని చెప్పడం నిజంగా గ్రేట్.. అన్ని షో లకు పర్మిషన్ ఇచ్చిన జగన్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. సంక్రాంతి పండగంటే దేవుడి పండుగ, కోడి పందాల పండుగ, సినిమా పండగ. సినిమాని కాపాడాలని ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన సందర్బంగా బంగార్రాజు సినిమా సూపర్ హిట్ అయింది.. మంచి విజయాన్ని అందుకుంది. అన్నీ సినిమాలకు ఎపి సర్కార్ మద్దథు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఆయన మాటలు ఆ కార్యక్రమానికి హైలెట్ అయ్యాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: