బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్ : ఎర్రన్న స్పీచ్.. ఏయ్ తమ్ముళ్లూ..!

shami
అక్కినేని తండ్రి కొడుకులు కలిసి సంక్రాంతి సూపర్ హిట్ కొట్టారు. ఈ సంక్రాంతికి బంగార్రాజుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అక్కినేని హీరోలు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇక వారి జోష్ ని ఫ్యాన్స్ తో సెలబ్రేట్ చేసుకునేందుకు రాజమండ్రిలో మంగళవారం బ్లాక్ బస్టర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఏపీ నేతలతో పాటుగా పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి కూడా ఈ వేడుకకి వచ్చారు.
తను చెప్పే ఎలాంటి విషయాన్నైనా చాలా ఫోర్స్ గా చెప్పే నారాయణ మూర్తి బంగార్రాజు సినిమాని ఆకాశానికెత్తారు. ఏయ్ తమ్ముళ్లూ మీరు నాగ చైతన్య అభిమాని కావొచ్చు..  ఏయ్ తమ్ముళ్లూ మీరు నాగార్జున అభిమాని కావొచ్చు.. ఏయ్ తమ్ముళ్లూ నేను అక్కినేని నాగేశ్వర రావు అభిమానిని అంటూ గంభీరంగా చెప్పారు నారాయణ మూర్తి. ఎర్రన్న ఏం మాట్లాడినా అంతే గంభీరంగా ఉంటుంది. ఇక బంగార్రాజు సినిమా చూసి ఆయన పొందిన అనుభూతిని ఆయన మాటల్లో వివరించారు నారాయణ
మూర్తి. సినిమాని ఏయన్నార్ గారే సక్సెస్ బాటలో నడిపించారని అన్నారు. సినిమాలో నాగ చైతన్య నటన చూసి ఆశ్చర్యపోయానన్న ఆయన వరుస విజయాలతో నాగ చైతన్య దూసుకెళ్తున్నాడని అన్నారు.          
నాగార్జున నేషనల్ హీరో అని.. ఆయన ఎలాంటి సినిమా అయినా తీయగలరని.. బంగార్రాజు లాంటి సినిమాలో ఆయన గొప్పగా నటించారని అన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు నాగార్జున వల్లే సాధ్యమని అన్నారు నారాయణ మూర్తి. హీరోయిన్ కృతి శెట్టి గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు నారాయణ మూర్తి ఉప్పెనతో బ్లాక్ బస్టర్.. శ్యామ్ సింగ రాయ్ మరో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు బంగార్రాజు కూడా ఆమెకి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిందని అన్నారు. తన పవర్ ఫుల్ స్పీచ్ తో నారాయణ మూర్తి అక్కినేని ఫ్యాన్స్ ని అలరించారు. సినిమా రిలీజ్ టైం లో కర్ఫ్యూని సడలించి బంగార్రాజు హిట్ కి కారణమైన ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఆర్.నారాయణ మూర్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: