వార్నీ : మాములు బంగార్రాజు .. బెట్టింగ్ బంగార్రాజు గా మారాడా ... ??

GVK Writings
కింగ్ అక్కినేని నాగార్జున, నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ బంగార్రాజు. యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ, సంపత్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నాగబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అందించిన సాంగ్స్ రిలీజ్ కి ముందే ఎంతో మంచి స్పందన అందుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి.
ఇక రిలీజ్ తరువాత సినిమాలో విజువల్ గా కూడా సాంగ్స్, బీజీఎమ్ మరింతగా ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ అందరినీ కూడా అలరించేలా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాని ఆద్యంతం తెరకెక్కించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక విషయం లోకి వెళితే రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న బంగార్రాజు మూవీకి రేటింగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. మరోవైపు సంక్రాంతి సీజన్ కూడా కావడంత ప్రేక్షకులు కరోనాని కూడా పెద్దగా లెక్కచేయకుండా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.
ఇక ఈ సినిమా అటు కలెక్షన్స్ పరంగా అన్ని ఏరియాల్లో దుమ్ము రేపుతుండగా, ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంత మేర కలెక్ట్ చేస్తుంది అనే దానిపై పలువురు ప్రేక్షకాభిమానులు జోరుగా బెట్టింగులు కూడా కాస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాల్లో అదరగొడుతుండగా ఓవరాల్ గా క్లోసింగ్ సమయానికి భారీ స్థాయిలో కలెక్షన్ సొంతం చేస్కునే ఛాన్స్ ఉందని చాలా మంది బెట్టింగులు కడుతున్నారని, ఇక ప్రస్తుతం బంగార్రాజు జోరు చూస్తుంటే దీనిపై బెట్టింగ్ కాసిన వారు అందరూ కూడా నిజమైన బంగార్రాజులు గా మారిపోయే ఛాన్స్ లేకపోలేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: