బంగార్రాజు ఓటిటి రిలీజ్ ఎప్పుడు అంటే..?

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు,  ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా మరో ముఖ్యమైన పాత్రలో నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది, బంగార్రాజు సినిమా కూడా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదలయ్యింది, విడుదల అయిన మొదటి షో నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ ల వద్ద ప్రదర్శించబడుతుంది.

ఈ సంవత్సరం సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోవడంతో బంగార్రాజు సినిమాకు కలెక్షన్ లు కూడా భారీగా వస్తున్నాయి, అయితే ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు రూపొందించాయి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ రేట్ల వివాదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నాగార్జున ఈ సినిమాను థియేటర్ లలో విడుదల చేశాడు,  తక్కువ బడ్జెట్ తో, తక్కువ సమయంలో ఈ సినిమాను చిత్రీకరించడం వల్ల ప్రస్తుతం ఈ సినిమాని భారీగా లాభాలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, బంగార్రాజు సినిమాను జీ 5  ఓటిటి లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, స్వయంగా ఈ మూవీని జీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొదించడంతో జీ 5 ఓటిటి లో 30 రోజుల తర్వాత సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం,  బంగార్రాజు సినిమాను ఫిబ్రవరి 14 వ తేదీన ఓటిటి లో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: