రష్మిక మందన్న ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. వైరల్?
ప్రస్తుతం స్టార్ హీరోలతో ఏ దర్శకుడు సినిమా తీసిన అందరికీ ఈ అమ్మడు హీరోయిన్ గా మొదటి ఆప్షన్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రష్మిక ను సినిమా లో పెట్టుకుంటే యూత్ ని బాగా ఆకర్షించవచ్చు అని దర్శక నిర్మాతలందరూ కూడా భావిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఒకసారిగా పాన్ ఇండియా లెవెల్ విజయాన్ని సాధించింది రష్మిక మందన. ఇకపోతే ఒకవైపు అందం అభినయం లోనే కాదు నటనలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకుంది ఈ కన్నడ భామ.
ఇప్పటి వరకు నటించిన అన్ని పాత్రలలో కూడా తనదైన నటనతో ఎంతగానో ఆకర్షించింది.. అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మందన కు సంబంధించిన ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రష్మిక మందన యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటున్న సమయంలో డైలాగులు చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడిన ఈ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఇప్పుడు ఎలాంటి యాసలోనైనా అలవోకగా డైలాగులు చెప్పేస్తుంది రష్మిక మందన. సినిమా ఇండస్ట్రీకి రాకముందు మాత్రం చిన్నచిన్న డైలాగులు చెప్పడానికి కూడా ఎంతో ఇబ్బందిపడింది అన్నది ఇక ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.