బంగార్రాజును చూసి మధనపడుతున్న భీమ్లా నాయక్ !

Seetha Sailaja
సంక్రాంతికి రావలసిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాధే శ్యామ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలు వాయిదా పడినప్పటికీ ధైర్యంగా నాగార్జున తన ‘బంగార్రాజు’ ను లైన్ లోకి దింపాడు. దీనితో నాగార్జున సాహసం చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నాగ్ సినిమాకు కలక్షన్స్ వస్తాయా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.

అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘బంగార్రాజు’ సంక్రాంతి విన్నర్ గా విజయం సాధించింది అన్నవార్తలు వస్తున్నాయి. ఈసినిమా విడుదలైన మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీకి 35కోట్లు గ్రాస్ కలక్షన్స్ వచ్చాయి అన్నవార్తలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి. ఈమూవీ ప్రమోషన్ లో నాగార్జున మాట్లాడుతూ సంక్రాంతి అంటే జనం సినిమా చూడకుండా ఉండలేరని అందువల్ల తన మూవీకి కలక్షన్స్ సమస్య ఉండదు అంటూ చెప్పి చాలామందిని ఆశ్చర్య పరిచాడు.

ఇప్పుడు నాగార్జున అంచనాలు నిజం అయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు నాగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీకి టాక్ చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. అయితే ఈసినిమాకు పోటీగా మరే టాప్ హీరో మూవీ విడుదల కాకపోవడంతో నాగ్ కు ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు ఇలాంటి అవకాశాన్ని ‘భీమ్లా నాయక్’ ఎందుకు వదులుకుంది అంటూ కొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
వాస్తవానికి ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేస్ కు రావలసి ఉంది. అయితే ఆమూవీని ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం త్యాగం చేసారు. ‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదా పడినప్పటికీ పవన్ సినిమాను మళ్ళీ విడుదల చేయడానికి ప్రయత్నించలేదు. అయితే కరోనా కేసులు ఎలా ఉన్నప్పటికీ తెలుగు ప్రజలు చాల ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్న పరిస్థితులలో ధైర్యం చేసి ‘భీమ్లా నాయక్’ ను విడుదల చేసి ఉంటే ఈమూవీకి బీసి సెంటర్స్ లో అదేవిధంగా యూత్ ప్రేక్షకులు పవన్ అభిమానులు కలిసి ఈమూవీకి రికార్డు కలక్షన్స్ కురిపించి ఉంటారు అన్నమాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: