విజయ్ తో ఒక ఆట ఆడుకున్న బాలయ్య..!

murali krishna
నందమూరి బాలకృష్ణ బాగా దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వస్తున్నారు.. ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఎనర్జీ కూడా పెరుగుతుంది బాలయ్యకి 


వరుస సినిమాలు పట్టాలు ఎక్కించడంతో పాటు బుల్లి తెరపై కూడా సక్సెపుల్ గా అన్ స్టాపబుల్ షోను రన్ చేస్తున్నారు మన బాలయ్య. స్టార్ మరియు సూపర్ స్టార్ గెస్ట్ లతో ఓ ఆట ఆడుకుంటూ బాలయ్య షోను ఎంతో బాగా చేసేస్తున్నారు.


ఇఫ్పటి వరకూ బాలకృష్ణ  అన్ స్టాపబుల్ షోకు చాల మంది గెస్ట్ లు వచ్చి వెళ్లారు.మంచు ఫ్యామిలీతో స్టార్ట్ అయి నానీ, అఖండా టీమ్ అలాగే రాజమౌళి, పుష్ప టీమ్, రవితేజ,మహేష్ బాబు, రానా, ఇలా స్టార్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్న బాలయ్యబాబు.. అందరితో తనదైన మార్క్ స్టైల్ కామెడీతో అలాగే ప్రశ్నలతో.. అలరిస్తూ  ఆడియన్స్ ఆకట్టుకుంటున్నారు మన బాలయ్య. వెండితెరపైనే కాదుగా బుల్లి తెరపై కూడా సింహం సింహమే అన్నట్టు దూసుకుపోతున్నరు మన బాలయ్య.


ఇక సంక్రాంతికి లైగర్ టీమ్ తో అన్ స్టాప్పబుల్ అనిపించాడట బాలయ్య.లైగర్ టీమ్ తో అన్ స్టాపబుల్ ఎంటర్ టైన్మెంట్ ను చూపించాడట. లైగర్ టీమ్ నుంచి యంగ్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పాటు స్టార్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్, ఛార్మీ కూడా ఈ షోలో సందడి సందడి చేశారు. ఈ ముగ్గురిని ఫన్నీ అండ్ ప్రోఫెషనల్ క్యశ్చన్స్ తో బాగా హడలెత్తించాడు బాలయ్య. సరదా సరదా లుక్ తో కూడా సందడి చేశాడు. ఇక ఈ సందర్భంగా బాలయ్య బాబు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కోరికమేరకు తాను మద్యం తాగేప్పుడు పాడే పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా పాడి వినిపించాడట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.


బాలయ్య బాబు సంక్రాంతి లుక్ అయిన పట్టు పంచెలో కనిపించగా విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో మెరిసిపోతు కనిపించారు.. బాలయ్య ఎనర్జీకి.. విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఈ ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయ్యిందని తెలుస్తుంది.అంతే కాదు విజయ్ దేవకొండతో స్టేజ్ మీద బాలయ్య బాక్సింగ్ చేసి కూడా చూపించాడు. ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్యఎనర్జీకి విజయ్ దేవరకొండ సైతం ఫిదా అయిపోయాడట.బాలయ్య అంటే ఎంతో ఇష్టమున్న పూరి జగన్నాథ్. ఈ ఎపిసోడ్ లో ప్రతీ మూమెంట్ ను కూడా బాగా ఎంజాయ్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: