బాప్ రే..బంగార్రాజు కోసం కృతి అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..?

VUYYURU SUBHASH
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువుగా వినిపిస్తున్న పేరు కృతి శెట్టి. అమ్మడు ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో తెలియదు కానీ..వరుసగా హిట్ సినిమాలు తీసుకుంటూ పోతుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన సినిమాతోనే ఈ అమ్మడు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ కృతి పేరు మాత్రం ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంటే అంత పెద్ద హీరోల ఫ్యామిలీ నుండి వచ్చినా వైష్ణవ్ ఆ పేరు సాధించలేకపోయాడు. అది అమ్మడు అదృష్టమో లేక వైష్ణవ్ బ్యాడ్ లక్ అనాలో తెలియడంలేదు.
ఇక ఉప్పెన సినిమాతో తన లేత అందాలను పద్ధతిఎంట్రీ  చూయించి ఆకట్టుకున్న ఈ చిన్నది..రెండో  సినిమాకి ఓ మెట్టు ఎక్కి మోడ్రెన్  లుక్ లో దర్శనమివ్వడమే కాకుండా..యంగ్ హీరో నాని తో బెడ్ పై హాట్ సీన్స్ కూడా చేసి..యువత కి చూపులతోనే చెమటలు పట్టించింది. దీంతో నాని శ్యాం సింగరాయ్ మూవీ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కృతి. ఇక ముచ్చట మూడో సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ల లిస్ట్ చేరిపోయింది కన్నడ బ్యూటీ కృతి.
నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన చిత్రం "బంగార్రజు"..ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా సంక్రాంతి కి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైం మాస్ లుక్ లో నాగలక్ష్మి పాత్రలో కనిపించిన కృతిని చూసి షాక్ అయ్యారు జనాలు . ధియేటర్స్ లో నాగలక్ష్మి చెప్పిన ప్రతి డైలాగ్స్ ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు. అంతలా ఆమె పాత్ర జనాలకు బాగా నచ్చేసింది. ఇక బంగార్రాజు సినిమాతో కృతి హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు కృతి నాగలక్ష్మి పాత్రలో కనిపించడానికి  ఏకంగా కోటీ 60 లక్షలు తీసుకుందట. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారుమ్రోగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: