షాక్:సీనియర్ హీరో మలయాళ నటుడు పై పోలీస్ కేస్.. కారణం..?

Divya
కరోనా కాస్త తగ్గుముఖం పట్టే సరికి మనదేశం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బయటపడుతోంది. కానీ తాజాగా మరొకసారి థర్డ్ వేవ్ రావడంతో ప్రతి రోజూ ఎన్నో లక్షలమంది ఈ వైరస్ బారిన పడి.. వేల సంఖ్యలో మరణాలు సంభవించడం జరుగుతోంది.. అయితే ఈసారి లాక్ డౌన్ విషయాన్ని మాత్రం పూర్తిగా ఆయా రాష్ట్రాలకే వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎంత పకడ్బందీగా ఉన్నప్పటికీ.. ఎక్కడో ఒకచోట పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి కరోనా కేసులు. ఇక ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కోవిడ్ నిబంధనలు ఎవరైనా సరే పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన నటుడు మమ్ముట్టి పై కేరళ లో పోలీస్ కేసు నమోదు కావడం జరిగింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మమ్ముట్టి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని మమ్ముట్టి ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేయడం ఇక అసలు విషయంలోకి వెళ్తే..ఈ ఏడాది జనవరి 3వ తేదీన.. కోజికోడ్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించగా అక్కడికి మమ్ముట్టి తో పాటు, మరొక నటుడు రమేష్ షిషరోడి హాజరు కావడం జరిగింది. ఇక అక్కడ కీళ్లమార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్స సేవలకోసం హాస్పిటల్ ను ప్రారంభించారు. ఇక అక్కడి ఉండేటువంటి స్థానికులతో ఈ నటులు మాట్లాడడం కూడా జరిగింది. కానీ అలా మాట్లాడేటప్పుడు కోవిడ్ నిబంధనలను పాటించలేదని.. సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో హీరో మమ్ముట్టి, రమేష్ లతో సహా అక్కడ ఉన్న 300 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందట.
ఆస్పత్రి యాజమాన్యం మాత్రం... ఆస్పత్రి చుట్టు పరిసరాలలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించామని , అంతేకాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించామని తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం పై పోలీసులు విచారణ చేయడం జరుగుతోంది. ఏది ఏమైనా  ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: