వావ్: ఈషా రెబ్బా అందాలు చూస్తే అబ్బా అనాల్సిందే..!!

Divya
తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకునే హీరోయిన్లలో హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఒకరు. తన అందం , అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున తన అభిమానుల కోసం సరికొత్త లుక్ లో దర్శనమిచ్చింది. ఈమె ఓరుగల్లు ప్రాంతానికి చెందిన హీరోయిన్. పండుగ రోజున తన అభిమానుల కోసం గులాబీ రంగు కలిగిన చీరలో దర్శనమిచ్చింది.
 చేతిలో దేవుడి బొమ్మలను పట్టుకొని తన ముఖం పై చిరునవ్వు చిందిస్తూ నిలబడింది. అంతేకాకుండా తన నడుముకి వడ్డానం ధరించి మరింత అందాన్ని చూపిస్తోంది ఈషా రెబ్బా.
ఈమె ముస్తాబు అయిన పద్ధతి చూస్తే పండుగ రోజున తన అభిమానుల కోసం స్పెషల్ గా రెడీ అయినట్టు గా కనిపిస్తోంది. సాంప్రదాయమైన కట్టుబట్టలతో ఈషా రెబ్బా తన అభిమానుల కోసం హ్యాపీ సంక్రాంతి అని శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మొదటిసారిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అందానికి తగ్గ అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
 
దానికి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే తాజాగా ట్విట్టర్లో తన పట్టువస్త్రాలతో కలిగిన కొన్ని సాంప్రదాయమైన దుస్తుల లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది.ఇక తమ అభిమానుల కోసం పండుగ శుభాకాంక్షలు తెలుపుతోంది.. దీంతో అభిమానులు కూడా ఈమెకు ట్విట్టర్ లో సంక్రాంతి ట్రీట్ అదిరిపోయింది అని ట్వీట్ చేయడం జరుగుతోంది. ఇక మరికొంతమంది ఏంజెల్ తో కూడా పోలుస్తున్నారు. చీరలో అచ్చం దేవతల ఉందంటూ మరికొందరు కూడా ఈమెను పొగడడం మొదలుపెట్టారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత, రాగల 24 గంటల్లో అనే మూవీలలో నటించింది. తాజాగా తమిళంలో కూడా ఓ మూవీలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: