'పుష్ప 2' ఐటెం సాంగ్ కోసం రంగంలోకి బాలీవుడ్ హీరోయిన్..!!

Anilkumar
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం 'పుష్ప' . ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుని బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా రిలీజ్ అయిన ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో ఈ సినిమాకి ప్రేక్షకులు భారీ ఆదరణ కనబరిచారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజు అనే ఒక డీగ్లామర్ మాస్ రోల్ పోషించారు. ఇక సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ చేసిన పర్ఫామెన్స్ కి ఆడియన్స్ అందరు ఫిదా అయ్యారు.

రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైస్ పేరుతో విడుదలైంది. ఇక ఇప్పటికే మొదటి భాగం మంచి విజయాన్ని అందుకోగా.. త్వరలోనే రెండో భాగాన్ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా పుంజుకొని పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కొల్లగొట్టింది. ఇక ఫిబ్రవరి నుంచి పుష్ప - 2  షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 2 కు సంబంధించి తొలి షెడ్యూల్ లోనే పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ ని షూట్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఇదిలా ఇలా ఉంటే పుష్ప 1 లో స్టార్ హీరోయిన్ సమంత తో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్.. ఇప్పుడు పుష్ప 2 కోసం మరో క్రేజీ హీరోయిన్ ని రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి ఆ బ్యూటీని తీసుకురానున్నారట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలీవుడ్లో పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ లోనే ఐటమ్ సాంగ్ షూటింగ్ ని పూర్తి చేసే అవకాశం ఉందట. అయితే ఆ ఐటమ్ బ్యూటీ ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఆమె ఎవరనేది చిత్ర బృందం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: