అలాంటి లుక్ లో మంచు లక్ష్మి..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి, సిద్ధార్థ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో ప్రతినాయక పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికి ఈ సినిమాలో మంచు లక్ష్మి ప్రతినాయక పాత్ర నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి, ఆ తర్వాత మంచు లక్ష్మి అనేక సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది, ఇది మాత్రమే కాకుండా అనేక టీవీ షో లకు, ఓటిటి షో లకు హోస్ట్ గా  కూడా వ్యవహరించింది,  అలాగే వెబ్ సిరీస్ ల ద్వారా కూడా మంచు లక్ష్మి ప్రేక్షకులను అలరించింది.

 ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో, టీవీ షో లతో, ఓటిటి షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా మంచు లక్ష్మి ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో మంచు లక్ష్మి అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, మెడలో ఒక నెక్లెస్ వేసుకొని అదిరిపోయే లుక్ లో ఫోటో కి స్టిల్ ఇచ్చింది, ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: