ట్రెండింగ్:పవన్.. బ్రహ్మానందం జాతకాన్ని మారుస్తారా..?

Divya
పవన్ కళ్యాణ్ తన కెరియర్ లోనే ,అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో నిర్మించడం జరుగుతోంది. ఈ మూవీ ని ఈ ఏడాది శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని సినిమా టికెట్ల విషయంపై.. తగిన నిర్ణయం తీసుకుంటే ఈ సినిమా ఆ తేదీకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏ బడా సినిమాలు ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లలో విడుదల అయ్యేందుకు అనుకూల మైన పరిస్థితులు కనిపించలేదు.
భీమ్లా నాయక్.. మూవీలో ఆమధ్య బ్రహ్మానంద నటిస్తున్నాడు అన్న వార్త బాగా హల్ చల్ చేసింది. తాజాగా బ్రహ్మానందం కూడా ఒక షోలో పాల్గొన్నప్పుడు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే తన పాత్రకు సంబంధించిన ఏ విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. అయితే సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రకారం.. బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని సమాచారం. ఈమధ్య బ్రహ్మానందం సినిమాలలో నటించే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కేవలం గత సంవత్సరం జాతి రత్నాలు సినిమాతోనే సరిపెట్టుకున్నాడు బ్రహ్మానందం. కానీ ఆ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి బ్రహ్మానందానికి.
పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం గతంలో నటించిన సినిమాలు బాగానే సక్సెస్ అయ్యాయి. అంతేకాకుండా ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మానందం చెప్పే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని సినీ ఇండస్ట్రీలో టాక్ గా వినిపిస్తోంది. తాజాగా కొన్ని సంవత్సరాల నుంచి బ్రహ్మానందం స్టార్ హీరోల సినిమాలలో నటించడం లేదు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా మంచి సక్సెస్ను అందుకుందటే.. ఆ తర్వాత అయినా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వెళ్ళు పడతాయేమో.. తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా పై అభిమానులు ప్రేక్షకులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: