బంగార్రాజు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు, ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ మాత్రమే కాకుండా సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.  ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఈ రోజు అనగా జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది, అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా నిన్న చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది, అందులో భాగంగా నాగార్జున కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది, అయితే బంగార్రాజు సినిమాకు కూడా సీక్వెల్ రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి, అయితే నాగార్జున తాజాగా  జరిగిన బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయంపై స్పందించాడు. సీక్వెల్ ఉంటుంది అని సోగ్గాడు తీయలేదు, ఇప్పుడు ఈ బంగార్రాజు సినిమా బాగా  ఆడన్నివ్వండి, ఒక వారం రోజుల తర్వాత అన్ని నిర్ణయిద్దాం, బంగార్రాజు ఎప్పుడంటే అప్పుడు భూమ్మీదకు వస్తుంటాడు గనుక, ఈ మూవీ హిట్ అయితే సీక్వెల్ ఉంటుంది అని నాగార్జున తెలియజేశాడు. బంగార్రాజు సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు, అనూప్ రూబెన్స్ సమకూర్చిన సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: