బన్నీ భలే పని చేశాడు గా.. వారిని ముంచేశాడు!!

P.Nishanth Kumar
అల్లు అర్జున్ పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించడం ఏమో కానీ బాలీవుడ్ లోని ఓ ప్రతిష్టాత్మక సినిమా మంచి సినిమా భారీ ఫ్లాప్ గా మిగిలింది అని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు భారీ వసూళ్లను కూడా సంపాదించి ఈ మధ్య భారీ వసూళ్లను సాధించిన సినిమాగా పుష్ప చిత్రం నిలిచింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా పుష్ప సినిమా కు మంచి వసూళ్లతో పాటు గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి.

ఏదైతేనేం బన్నీ అభిమానులు ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం పట్ల ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మాస్ ప్రేక్షకులను అలరించడానికి మాస్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. తప్పకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని అందరూ భావించారు తప్ప ఇంత పెద్ద సక్సెస్ సాధించి చిత్ర యూనిట్ కి మంచి పేరు తీసుకు వస్తుందని ఎవరూ కూడా అనుకోలేదు. అయితే ఈ సినిమా వచ్చే సమయానికి బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 83 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించగా 1983 ప్రపంచ కప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అందరినీ ఎంతగానో అలరిస్తుందని చిత్ర యూనిట్ భావించింది. అంతే కాదు దేశం మెచ్చిన దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరొక అవార్డు విన్నింగ్ సినిమా అవుతుందని అనుకున్నారు. కానీ పుష్ప మేనియా లో ఈ సినిమాని ఎవరూ కూడా పట్టించుకోక పోవడం విశేషం. పీరియాడికల్ సినిమా అందులోనూ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఏ విధంగానూ మెప్పించలేకపోయింది. దాంతో పుష్ప సినిమాకు మాస్ లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: