వైసిపి నేతలపై జగన్ కు చిరంజీవి ఫిర్యాదు !

Veldandi Saikiran
అమరావతి : ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిన  మెగాస్టార్ చిరంజీవి.. ఆ రాష్ట్ర  సీఎం జగన్ మవహం రెడ్డి తో సమావేశం అయ్యారు.  సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి జగన్, చిరంజీవి  చర్చించారు.  టికెట్ రేట్లు పెంచే అంశాన్ని పరిశీలించాల్సిందిగా చిరంజీవి కోరినట్లు సమాచారం అందుతోంది.  టికెట్ వ్యవహారంతో పాటు థియేటర్ల మలో  కరెంట్ బిల్లులు, మినహాయింపులు,  పలు ఇతర అంశాలను చిరంజీవి ప్రస్తావించినట్లు సమాచారం అందుతోంది.  కొంత మందిని టార్గెట్ చేసుకునే ప్రభుత్వ నిర్ణయాలు అనే ప్రచారం పై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  

అలాంటి ఉద్దేశ్యం, అవసరం ప్రభుత్వానికి లేదని చిరంజీవికు సీఎం జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం అందుతోంది. ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఇండస్ట్రీ నమ్ముతోంది అని సీఎం అన్నట్లు సమాచారం  అందుతోంది. వైసీపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.  పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎవరూ ఖండించ లేదు అని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.  మరొక సారి మిగిలిన సినీ పెద్దలు అందరూ కలిసి వస్తాం అన్నారు చిరంజీవి.  బీ, సీ సెంటర్ లలో టికెట్ రేట్లు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెలాఖరు నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  "బ‌య‌ట‌కు క‌న్పించేంత గ్లామ‌ర్ ఫీల్డ్ కాదు.  రెక్కాడితేకాని డొక్కాడ‌ని కార్మికులు ఇండ‌స్ట్రీలో ఉన్నారు.  క‌రోనా స‌మ‌యంలో స‌నీ కార్మికులు ఇబ్బందులు ప‌డ్డారు.   సినీ ఇండ‌స్ట్రీలో ఉన్నవారంతా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దు అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వారం ప‌ది రోజుల్లో ఏపీ ప్ర‌భుత్వం నుంచి కొత్త జీవో వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను.  అంద‌రూ సంయ‌మ‌నం పాటించండి.  ఫిల్మ్ ఛాంబ‌ర్‌, ఎగ్జిబిట‌ర్ల ప్ర‌తినిథుల‌ను పిలిచి సీఎం మీటింగ్ పెడ‌తామ‌న్నారు.  స‌మ‌స్య‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుందన్నారు  మెగాస్టార్ చిరంజీవి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: