ఫిల్మ్ @15 : దేశముదురు ఇప్పుడెక్కడున్నాడో?

RATNA KISHORE
సినిమా సినిమాకూ మ‌ధ్య గ్యాప్ ఉంటుంది
ఓ సినిమాను ఇంకో సినిమాతో గ్రాఫ్ ఉంటుంది
ఈ రెండూ ఉప‌యోగ‌ప‌డ్తాయి
గ్యాప్ తెలుసుకునేందుకు గ్రాఫ్ ఇంకొంత ఎదిగేందుకు
ఈ రెండూ పనిచేశాయి
బ‌న్నీకి మ‌రియు పూరీకి

బాగా తెలిసిన స్టోరీ అయినా కూడా దేశ‌ముదురు హిట్..బ‌న్నీ ఆ లెవ‌ల్ లో చేశాడు మ‌రి! సున్నిత భావోద్వేగాలులో హ‌న్సిక బాగా క‌నిపించింది అని ఆడియెన్స్ మురిసిపోయారు. ఆ విధంగా మొద‌టి సినిమాతోనే హ‌న్సిక టాప్ హీరోయిన్ అయిపోయింది.
అప్ప‌టిదాకా ఉన్న ఇమేజ్  గ్రాఫ్ ను ఒక్క‌సారిగా పెంచుకున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్..పెద్ద ఖ‌ర్చు చేయ‌కుండానే ఈ సినిమాను ఫినిష్ చేసి నిర్మాత డీవీవీ దాన‌య్య‌ను సేఫ్ లోనే ఉంచాడు పూరీ. అటుపై పూరీ ఇంకా పెద్దాడ‌యిపోయాడు.డైరెక్ట‌ర్ గా ఎదుగుతూ ఎదుగుతూ వ‌స్తున్నా దేశ‌ముదురు విష‌య‌మై మాత్రం ఆయ‌న తీసుకున్న శ్ర‌ద్ధ ఓ మంచి హిట్ కొట్టేందుకు ఎంత‌గానో స‌హ‌క‌రించింది.

దేశ ముదురు ఇప్పుడు ఎక్క‌డున్నాడు.. ఆ రోజు మాస్ లో ప్ర‌భంజ‌నం సృష్టించాడు..త‌న పెర్ఫార్మెన్స్ తో సునామీ తీసుకువ‌చ్చాడు. ఓ మాస్ హీరో ఇలా కూడా క‌నిపించ‌వ‌చ్చా అన్న‌ది స్టైలిష్ లుక్ లో ఆయ‌న అల‌రించాడు.ఆ రోజు పూరీ వేరు ఇప్పుడు వేరు.ఆయ‌న మార్క్ డైలాగ్ లు ప‌లికిన ప్ర‌తిసారీ సినిమాలు హిట్ కొడుతూనే ఉన్నాయి.ఈ సినిమాలో బ‌న్నీతో పాటు న‌ర్తించేందుకు స్పెష‌ల్ పెర్ఫార్మెన్స్  రూపంలో రంభ‌ సంద‌డి చేసింది.మౌన‌మే మౌన‌మే.. పాట మెలొడీల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంటే,నిన్నే నిన్నే..పాట మాస్ లో గొప్ప ట్రేడ్ టాక్ తెచ్చుకుంది.


ఈ ఏడాదితో దేశ‌ముదురు సినిమాకు  15 ఏళ్లు నిండుతున్నాయి. మాస్ ఎంట‌ర్ టైన‌ర్స్ ను చిత్రీక‌రించ‌డంలో ఎంతో పేరున్న పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను రూపొందించి భ‌లే హిట్టు కొట్టారు.చ‌క్రీ సంగీతం ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. బ‌న్నీ కెరియ‌ర్ లో మంచి క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన సినిమాగానూ ఇది నిలిచింది.బ‌న్నీ కెరియ‌ర్ తొలి రోజుల్లోనే మాస్ ను ఆక‌ట్టుకునేందుకు సిక్స్ ప్యాక్ చేసి మ‌రీ! అద‌ర‌గొట్టాడు.పాల‌బుగ్గ‌ల చిన్న‌ది హ‌న్సిక ఈ సినిమాకు మ‌రో అద‌న‌పు ఆకర్ష‌ణ.సినిమా ప‌ది కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కితే, 29 కోట్ల రూపాయ‌ల మేర‌కు గ్రాస్ వ‌సూలు చేసింది అని బాక్సాఫీస్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: