ఆ స్టార్ హీరో వివాహం ఎలా జరిగిందో తెలుసా

D.V.Aravind Chowdary
మోహన్ లాల్ , భారత చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. ఎటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి  మలయాళ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ ఎదిగినా కేవలం అక్కడికే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చలనచిత్ర పరిశ్రమల్లో సైతం తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. 

1997లో సహనటుడు సురేష్ గోపి నటించిన మలయాళ చిత్రం గురు భారత దేశం నుండి ఆస్కార్ అవార్డు నామినేషన్ కు ఎంపికైన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం ఉన్న దక్షిణాది నటుల్లో 5 జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక నటుడు మోహన్ లాల్ . ఎటువంటి కష్టతరమైన పాత్రనైన అవలీలగా చేయగలరు. నటనలో పరిపూర్ణత సాధించి నటుడిగా పలువురి ప్రశంసలు అందుకున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా గాయకుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్త గా కూడా విజయవంతం అయ్యారు.

సినీ రంగంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న  మోహన్ లాల్ , వ్యక్తిగత జీవితం లో సైతం పరిపూర్ణ మైన భర్త , తండ్రి కూడా. ఇంతకీ మోహన్ లాల్ భార్య ఎవరో తెలుసా? వారి వివాహం ఎలా జరిగిందో తెలుసా ? 

 లాల్ భార్య సూచిత్ర మోహన్ లాల్ దిగ్గజ సినీ నిర్మాత , ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ సుజాత సినీ ఆర్ట్స్ అధినేత కె.బాలాజీ గారి కుమార్తె. సూచిత్ర సోదరుడు సురేష్ బాలాజీ సైతం ప్రముఖ నిర్మాత. 

లాల్ మలయాళ సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తన సినిమాలతో ఎందరో మహిళా అభిమానులను సొంతం చేసుకున్నారు.వారిలో సూచిత్ర ఒకరు. దిగ్గజ నిర్మాత కుమార్తె అయినప్పటికీ సాధారణ అభిమానిగా తన అభిమానాన్ని చాటుతూ మోహన్ లాల్ కు ప్రతి నెలా ఉత్తరాలు రాస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. 

వీరి వివాహానికి మొదటి అడ్డంకి ఇరూ కుటుంబాల మధ్య ఉన్న వైరుథ్యం. లాల్ మలయాళీ నాయర్ కాగా, సూచిత్రా తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి. బాలాజీ గారు సంశయం లో ఉన్న సమయంలో  లాల్ తండ్రి  అంగీకారంతో సమసిపోయింది. వారి వివాహానికి రెండో అడ్డంకి వారిద్దరి జాతకాలు . జ్యోతిష్య నిపుణుడికి చూపించగా వారి జాతకులు కలవలేదు అని చెప్పడంతో ఇరు కుటుంబాలు సైతం వివాహా ప్రయత్నాలు విరమించుకుంటున్న సమయంలో లాల్ తల్లిగారు మరోసారి  వారిద్దరి జాతకాలు చూపించారు. రెండో సారి మాత్రం వారి జాతకాలు కలవడంతో  వారి వివాహం1988, 28 ఏప్రిల్ లో తిరువనంతపురం లో అంగరంగ వైభవంగా జరిగింది. 

వీరిద్దరి అనోన్య దాంపత్యానికి ప్రతీకలుగా కుమారుడు ప్రణవ్ , కుమార్తె విస్మయా ఉన్నారు. ప్రణవ్ ప్రస్తుతం మాలీవుడ్ లో యువ కథానాయకుడిగా రాణింస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: