వార్నీ : బన్నీ ఖాతాలో మరొక యాడ్ ... ??

GVK Writings
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక్కో సినిమాతో హీరోగా ఒక్కో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ కొనసాగుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అమాంతం తన క్రేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా పెంచుకుంటూ పోవడంతో పాటు హీరోగా మార్కెట్ స్థాయిని ని కూడా పెంచుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే .

మన తెలుగు రాష్ట్రాలతో పాటు అటు హిందీ లో కూడా అదరగొడుతున్న పుష్ప మూవీ టాలీవుడ్ రేంజ్ ని కూడా మరింతగా పెంచిందనే చెప్పాలి. దానితో హీరోగా అల్లు అర్జున్ కి అవకాశాలు కూడా మరింతగా పెరుగుతున్నాయి. త్వరలో పుష్ప పార్ట్ 2 తో పాటు, తనతో గతంలో సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన బోయపాటి శ్రీను తో మరొక మూవీ కూడా చేయడానికి సిద్ధం అయ్యారు అల్లు అర్జున్. అయితే విషయం ఏమిటంటే ప్రస్తుతం అటు సినిమాలతో పాటు పలు యాడ్స్ లో కూడా నటిస్తూ కొనసాగుతున్నారు అల్లు అర్జున్. 

ఇటీవల ఆయన నటించిన ర్యాపిడో యాడ్ అందరినీ ఎంతో ఆకట్టుకోగా లేటెస్ట్ గా ఆయన ఖాతాలో మరొక యాడ్ సంస్థ వచ్చి చేరిందని అంటున్నారు. నేడు అల్లు అర్జున్ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వారికి సంబందించిన ఒక లేటెస్ట్ యాడ్ ఫిలిం షూటింగ్ లో పాల్గొన్నారని, త్వరలో ఆ సంస్థ యాడ్ కి సంబంధించి అన్ని వివరాలు అధికారికంగా వెల్లడికాన్నట్లు సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే అటు హీరోగా సినిమాలతో పాటు ఇటు పలు యాడ్స్ ని కూడా దక్కించుకుంటూ తిరుగులేని ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ కొనసాగుతుండడం ఆయన అభిమానులకి విపరీతమైన ఆనందాన్ని కలుగచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: