బోయపాటి వెతుకులాట మామూలుగా లేదు..!

NAGARJUNA NAKKA
'అఖండ' విడుదలకు ముందు నుంచే బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే ప్రచారం జరుగుతోంది. బన్ని 'అఖండ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చాక ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. గీతా ఆర్ట్స్‌లోనే ఈ సినిమా ఉంటుందనే టాక్ వచ్చింది. అయితే ఇప్పటివరకు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ మాత్రం రాలేదు.
మరోవైపు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఇంతకుముందు 'సరైనోడు' సినిమా వచ్చింది. గీతా ఆర్ట్స్‌లోనే నిర్మాణమైన ఈ సినిమాతో బన్ని ఊరమాస్‌ హీరోగా మారాడు. మళ్లీ ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే కెజిఎఫ్ స్టార్ యశ్‌తో కూడా బోయపాటి సినిమా ఉండే అవకాశముందట. బోయపాటి శ్రీను, బాలకృష్ణ సినిమాలకు ఒక ఫార్మాట్‌ ఉంటుంది. మిగతా హీరోలతో సింగిల్‌ డోస్‌ సినిమాలే తీసినా, బాలయ్యతో మూవీ అంటే డబుల్‌ డోస్‌కి వెళ్లిపోతాడు. అయితే ఫస్ట్‌ టైమ్‌ బాలయ్యకే కాకుండా, అల్లు అర్జున్‌కి కూడా ఇలాంటి డబుల్‌ డోస్‌ ట్రీట్మెంటే ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. బోయపాటి శ్రీను రీసెంట్‌గానే 'అఖండ' సినిమాతో సూపర్‌ హిట్ కొట్టాడు. బాలక్రిష్ణని డ్యూయల్‌ రోల్‌లో ప్రజెంట్‌ చేసి బాక్సాఫీస్‌కి డబుల్‌ ఎనర్జీ ఇచ్చాడు. అయితే ఈ ఒక్క సినిమాలోనే కాదు ఇంతకుముందు బాలక్రిష్ణతో తీసిన 'సింహా, లెజెండ్‌' రెండు సినిమాల్లోనూ హీరోని డ్యుయల్‌ రోల్‌లో చూపించాడు. ఇప్పుడు బన్ని సినిమాకి కూడా ఇదే డబుల్‌ యాక్షన్‌ ఫార్ములా వాడుతున్నాడట బోయపాటి.
బాలక్రిష్ణ, బోయపాటి శ్రీను కెమిస్ట్రీకి బ్లాక్‌ బస్టర్‌ రికార్డ్ ఉంది. అలాగే వీళ్లిద్దరి సినిమా అంటే డబుల్ యాక్షన్‌ పక్కా అని ఆడియన్స్‌ కూడా ఫిక్స్ అయిపోతుంటారు. ఎందుకంటే బోయపాటి మిగతా వాళ్లతో తీసిన సినిమాల్లో హీరోని సింగిల్‌ రోల్‌లోనే చూపించాడు. 'భద్ర, తులసి, సరైనోడు, జయజానకి నాయక, సరైనోడు, వినయ విధేయరామ'లో హీరోలని సింగిల్‌ రోల్‌కే పరిమితం చేశాడు. బోయపాటి శ్రీను నెక్ట్స్‌ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ మూవీలో బన్ని డ్యుయల్‌ రోల్‌ ప్లే చేస్తాడని టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: