ఆ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్న అల్లుఅర్జున్..!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా విజయోత్సవంలో ఉన్నారట. ఈ సినిమా అన్ని భాషలలో అత్యధిక కలెక్షన్లను రాబట్టి విజయ పథంలో దూసుకొని పోతుంది.
ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 2 వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుందట.ఇక ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడనే విషయం పై ఎంతో ఆతృత నెలకొందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారని సమాచారం పెద్ద ఎత్తున వినపడుతోందట.అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ కాంబినేషన్ లో మరొక సినిమా రానుందని సమాచారం.. అయితే ఈసారి బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో చేయనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటివరకు అల్లు అర్జున్ కేవలం సింగిల్ పాత్రల్లోనే నటించారు ఈ క్రమంలోనే ఈ సారి బోయపాటి శీను దర్శకత్వంలో రాబోయే సినిమాలో ద్విపాత్రాభినయంలో చేయనున్నట్లు సమాచారం.
బోయపాటి శ్రీను తాజాగా బాలకృష్ణ హీరోగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారని అందరికి తెలుసు.. మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చినప్పటికీ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయని తెలుస్తుంది.. అయితే ఈ మూడు సినిమాలలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో చేయడం విశేషం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఈయన దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.మరి ఇవి ఎంతవరకు అనుకూలిస్తాయో వేచి చూడాలి.ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు ద్విపాత్రభినయంతో అదరగొట్టారు. వ్
కొంత మంది అయితే ఇండస్ట్రీ హిట్ సైతం సాధించారు. వారందిరికి డ్యూయల్ రోల్ తో మంచి పేరు మరియు మంచి నటులని గుర్తింపు వచ్చింది.మరీ అల్లుఅర్జున్ ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తాడో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: