బోయపాటి సినిమాలో బన్నీ పాత్ర అదేనా..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను తెరకెక్కించే సినిమాలను క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా 'అఖండ' సినిమాతో మరోసారి అది రుజువైంది. గత కొంతకాలంగా బోయపాటి ,బన్నీ కాంబినేషన్ సినిమా గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీగా కానున్నాడు. దీంతో ఇప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవు. అయితే పుష్ప పార్ట్ 2 తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ విషయం పక్కన పెడితే బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ ను ఎక్కువగా డ్యూయల్ రోల్ లో చూపించారు.

అయితే ఇప్పుడు బన్నీని కూడా అదే తరహాలో చూపించబోతున్నాడట బోయపాటి శ్రీను. బన్నీ తో చేయబోయే సినిమాలో బోయపాటి అల్లు అర్జున్ ని  డ్యూయల్ రోల్ లో చూపించబోతున్న ట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో బన్నీ  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. కాగా గతంలో రేసుగుర్రం సినిమాలో బన్నీ కొంతసేపు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. కానీ సినిమాలో ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఇప్పటివరకు బన్నీ నటించలేదు. అయితే ఇప్పుడు బోయపాటి సినిమాలో మాత్రం ఫుల్ లెన్త్ ఆఫ్ పోలీసర్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టా లెక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు తన ప్రతి సినిమాలో పుష్కలంగా మాస్ ఎలిమెంట్స్ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు బోయపాటి శ్రీను. ఈ క్రమంలోనే తాజాగా అఖండ సినిమాతో బోయపాటి శ్రీను తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా సినిమాకి బోయపాటి క్రేజ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: