బన్నీ డైరెక్టర్ తో పవన్ సినిమా..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మాస్ సినిమాలు తీయడం ఒక్క బోయపాటి శ్రీను కి మాత్రమే సాధ్యమైన పని. బోయపాటి శ్రీను ఈ మధ్య కాలంలోనే బాలయ్యతో అఖండ సినిమా చేసి మరోసారి అది నిజం అని నిరూపించాడు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలతో మంచి సినిమాలు చేయడం ఒక్క బోయపాటి శ్రీను కి మాత్రమే సాధ్యమైన పని. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా బోయపాటి ఒక సినిమా ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు సరైనోడు సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా ఇది.

ఇక బన్నీ నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగానే బోయపాటి శ్రీను మరియు అల్లు అర్జున్ కలిసి రాబోయే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా రావడానికి ఇంకా చాలా సమయం పట్టం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బోయపాటి శ్రీను ఈ గ్యాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం నిజమో అబద్దమో తెలియాల్సి ఉంది. ఈ విషయం పక్కన పెడితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

ఒకవేళ బోయపాటి కథ కి ఓకే చెప్పిన కూడా ఈ సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక బోయపాటి సినిమాలో హీరోగా చేయాలి అంటే ఏ రేంజ్ లో యాక్టింగ్ చేయాలి తెలిసిందే. ఆయన సినిమాలో మాస్ హీరోగా కనిపించాలి.మరి బోయపాటి సినిమాలో మాస్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తాడో లేదో చూడాలి మరి.మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: