చీరకట్టులో మైమరపిస్తున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్, అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఆశించిన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర తెచ్చి పెట్టలేదు.  ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం దక్కింది, అలాగే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి.
 

ఇలా కంచె సినిమా ద్వారా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత నక్షత్రం, జయ జానకి నాయక సినిమాలలో నటించింది, ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది, ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది,  ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, ఇతర విషయాలను కూడా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకునే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందచందాలతో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ప్రగ్యా జైస్వాల్ సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, మెడలో ఒక నెక్లెస్ ను వేసుకొని అదిరిపోయే క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: