బాలయ్య సాంగ్ తో నివేదా బెడిసికొట్టిన ప్రయత్నం..!

murali krishna
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఇప్పటికి కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో అదరగొట్టారుగా దీనితో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయట.అఖండ చిత్రం బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు.

బాలయ్య ఫాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా బోయపాటి మాస్ ఎలిమెంట్స్ ని పక్కాగా సెట్ చేశారు. దీనితో అఖండ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో 'జై బాలయ్య' సాంగ్ ఫ్యాన్స్ కోసమే అనే చెప్పాలి. థియేటర్స్ లోనే ఫ్యాన్స్ ఈ సాంగ్ కి చిందులేశారట.ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ ఇదేనని ఈ చిత్రానికి తమన్ అదిరిపోయే సాంగ్స్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

జై బాలయ్య సాంగ్ లో బాలకృష్ణ షర్ట్స్ విప్పుతూ వేసిన డ్యాన్స్ విపరీతంగా పాపులర్ అయింది. క్రేజీ బ్యూటీ నివేదా థామస్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా ఆమె తన విశేషాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుందట.తాజాగా నివేదా 'జై బాలయ్య' సాంగ్ కి బాలయ్య తరహాలో డ్యాన్స్ చేయాలని ట్రై చేసిందని తెలుస్తుంది m

షర్ట్స్ విప్పుతూ డ్యాన్స్ ట్రై చేసిందట కానీ ఆమె ప్రయత్నం బెడిసికొట్టిందట మొదటి షర్ట్ బాగానే ఓపెన్ అయింది కానీ ఆ తర్వాత షర్ట్స్ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు.. దీనితో నివేదానే నవ్వేసిందట ఈ వీడియో నెట్టింట ఎంతగానో వైరల్గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోందని నెటిజన్లు వెరీ ఫన్నీ అంటూ కామెంట్స్ పెడుతున్నారని తెలుస్తుంది.

అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ విలన్ పాత్రలో ఎంతో అద్భుతం గా నటించి మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: