బాలయ్య నోట ఆ మాట..అద్దిరిపోలే..!!

VUYYURU SUBHASH
నందమూరి నట సింహం బాలకృష్ణ మల్టీ టాలెంటెడ్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తనదైన స్టైల్లో రాజకీయాలు చేస్తూ..మధ్యలో హోస్ట్ గా కూడా మనల్ని తన పర్ ఫామెన్స్ తో మెప్పిస్తున్నారు. కెరీర్ లోనే ఎప్పుడు చేయని పాత్రను.. ఛాలెంజింగ్ గా తీసుకుని ధియేటర్స్ లో అఖండ తో దుమ్మురేపిన బాలయ్య..ఇటు హోస్ట్ గా కూడా వచ్చిన ప్రతి గెస్ట్లతో తన దైన స్టైల్లో ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి బడా సెలబ్రిటీస్ వచ్చి సందడి చేయగా..ఇప్పుడు పుష్ప తో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వెసుకున్న అల్లు వారి అబ్బాయి..స్టైలిష్ స్టార్..అభిమానులు ముద్దుగా పిలుచుకునే బన్నీ కూడా వచ్చారు.

బన్నీతో పాటు..పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక, అలాగే చిత్ర డైరెక్టర్ సుకుమార్ కూడా..అన్ స్టాపబుల్ షో తమ దైన రీతిలో సందడి చేసారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించి.. టీం ప్రోమోను విడుదల చేసింది. ఇక ఆ ప్రొమో లో బన్నీ ని, బాలయ్యను ఒక్కే ఫ్రేం లో చూసి మురిసిపోతున్న అభిమానులకు మరో సర్ ప్రైజ్ గా..బాలయ్య బన్నీ డైలాగ్ ను చెప్పారు. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ గా నటించిన్ బన్నీ చెప్పే ఓ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఆ డైలాగ్ ను బాలయ్య తన మాడులేషన్ లో చెప్పి అభిమానులను ఆశ్చర్య పరిచారు.
అచ్చం పుష్పరాజ్‏ను ఇమిటేట్ చేస్తూ తన స్టైల్లో తొడకొట్టి మరీ తగ్గేదే లే అంటూ డైలాగ్‏ చెప్పి అదుర్స్ అనిపించారు నట సింహం బాలయ్య. ఇక ఈ ప్రోమోని చూసిన నందమూరి అభిమానులు వాహ్ బాలయ్య ..ఇరగదీసావ్..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షో లో డైరెక్టర్ సుకుమార్, రష్మిక మందన్నా ని బాలయ్య తనదైన స్టైల్లో ఆటపట్టించి సందడి చేసిన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి బాలయ్య వెండితెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా దూసుకుపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: