బాలయ్య ఈ ఊపు కంటిన్యూ చేయాలంటే... ?

Satya
బాలయ్యకు హిట్లు కొత్త కాదు, బ్లాక్ బస్టర్లు అంతకంటే కొత్త కాదు, ఆయన సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇయర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఆ తరువాత ఒక ఏడాది వరసగా ఆరు హిట్లు ఇచ్చాడు. అలా బాలయ్య సక్సెస్ లతో ఆడుకున్నాడు.
ఒక విధంగా చెప్పాలీ అంటే చెలరేగిపోయాడు. అయితే బాలయ్యకు వచ్చిన ఫ్లాప్స్ కూడా మామూలువి కావు. మిగిలిన హీరోల సంగతేమో కానీ బాలయ్య కొడితే బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్. బొమ్మ యావరేజ్ అన్న టాకే అసలు ఉండదు. ఇదిలా ఉంటే బాలయ్య లెజెండ్ తరువాత ఆ ఊపు కంటిన్యూ చేయలేకపోయారు. మధ్యలో గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ పెద్ద సక్సెస్ ఇచ్చినా ఆ తరువాత ఏమీ లేదు.
ఇపుడు అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ తరువాత బాలయ్య వరసబెట్టి రెండు మూడు హిట్లు ఇస్తే చాలు ఒక దశాబ్దం పాటు ఆయనే తిరుగులేని హీరో అయిపోతారు. అయితే బాలయ్య డైరెక్టర్స్ ని బాగా నమ్ముతారు అని అంటారు. వారు చెప్పిన స్టోరీ లైన్ ని వినేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తీరా అవి తెర మీద కనిపించినపుడు  సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడంతో ఫ్లాప్స్ వచ్చాయి. ఇపుడు బాలయ్య లైనప్ అయితే బాగుంది. క్రాక్ డైరెక్టర్ గోపీ చంద్ మలినేని మూవీని వెంటనే చేస్తున్నారు. ఆ తరువాత అనిల్ రావిపూడి మూవీ కూడా బెస్ట్ ప్రాజెక్ట్. ఈ రెండూ గ్యారంటీగా హిట్ అవుతాయని అంతా నమ్ముతున్నారు.
ఆ తరువాత మాత్రం బాలయ్య మొగమాటానికి పోయి ప్రయోగాలు చేస్తే మాత్రం కష్టమే అంటున్నారు. మొత్తానికి అఖండ ఇచ్చిన హిట్ తో బాలయ్య దూకుడు పెంచాలని మంచి స్టోరీ, పెద్ద బ్యానర్లు టాప్ టెక్నీషియన్స్ తో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: