ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు, పుష్ప కూడా అంతేనట .... ??

GVK Writings
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్కొక్కటిగా పెద్ద సినిమాల విడుదలలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బాలయ్య హీరోగా రిలీజ్ అయిన అఖండ మంచి కలెక్షన్స్ అందుకుంటూ ఉండగా ఈ నెల 17న అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన పుష్ప సినిమాకి సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
అల్లు అర్జున్, పుష్పరాజ్ అనే మాస్ పాత్ర చేస్తున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక మరొకవైపు రానున్న 2022 జనవరి 7న ఎన్టీఆర్, చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దీనిని నిర్మిస్తున్నారు.
ఇక ఈ మూవీపై కూడా దేశ, విదేశాల్లోని ఆడియన్స్ లో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే పాపులర్ అయ్యాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, అటు పుష్ప, ఇటు ఆర్ఆర్ఆర్ రెండు సినిమాలు కూడా మొత్తంగా మూవీ రన్ టైం 3 గంటలకు పైగానే ఉండనున్నాయని సమాచారం. రెండు సినిమాలు కూడా మంచి కథ, కథనాల బలం కలిగినవి కావడం వల్లనే అంత రన్ ఉందని అంటున్నారు. అయినప్పటికి కూడా రేపు రిలీజ్ తరువాత ఈ రెండు సినిమాలు థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని తప్పకుండా ఆకట్టుకుని సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని కూడా టాక్. మరి ఇవి రెండు రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: