చిరు అందుకే తగ్గేదెలే అంటున్నాడా!!
త్రిష కథానాయిక గా నటించబోతుందని తెలుస్తుంది. సత్యదేవ్ మరియు నయనతార కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర చిత్రాన్ని చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తమిళనాట సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు ఇది రీమేక్ కాగా చిరు స్థాయిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర యూనిట్. ఇలా ఒకేసారి రెండు సినిమాలను చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులోనూ తనకు సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందో తెలియజేస్తూ ఉన్నాడు.
అయితే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను కూడా చేసి తనదైన మార్క్ చూపించాడు చిరు. ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. వాల్తేరు వీరన్న అనే టైటిల్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. మరి మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయిలో పలు సినిమాలను చేయడం పట్ల అందరికీ ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉండగా ఆయన ఇన్ని సినిమాలు చేయడం వెనక ఓ కారణం ఉందట. అదేమిటంటే ఆయన కూతురు సుస్మిత ఇన్ని సినిమాలు చేయడానికి ముఖ్య కారణం అని తెలుస్తుంది. ఆమె కూతురు ఆయన డేట్ల దగ్గర నుంచి ఆహార నియమాలు వరకు అన్నీ చూసుకుంటూ ఆయన బలంగా ఉండేలా చేస్తుంది. ఆ విధంగా ఆయన అన్ని సినిమాలు చేయడానికి ముఖ్య కారణం ఆయన కూతురు సుస్మిత అన్నమాట.