వెంకీ కి లైసెన్స్ వచ్చేనా.. రీమేక్ రాజా అనిపించుకుంటున్నాడు.!!

P.Nishanth Kumar
విక్టరీ వెంకటేష్ వరసగా రీమేక్ సినిమాలలో నటిస్తూ వాటితో భారీ స్థాయిలో హిట్లు అందుకుంటూ ఏ హీరో కి సాధ్యం కాని విధంగా ముందుకు దూసుకు పోతున్నాడు. ఇతర హీరోలు ఒరిజినల్ కథలను విని వాటి ద్వారా హిట్లు కొట్టి ముందుకు వెళుతుంటే వెంకటేష్ మాత్రం ఎంతో ఈజీగా సినిమాలను రీమేక్ చేసి తెరకెక్కించడం విజయాలు సాధించడం ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. అలా ఇటీవల ఆయన హీరోగా నటించిన నారప్ప అనే తమిళ సినిమా రీమేక్ అలాగే దృశ్యం అనే సినిమా మలయాళ రీమేక్ లు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు. 

మరొక వైపు ఒరిజినల్ కథలను కూడా చేస్తూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతున్నాడు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్3 అనే సినిమాను వరుణ్ తేజ్ తో కలిసి చేస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమాలో ఆయనకు జోడీగా తమన్నా నటిస్తున్నారు. మరొక హీరోయిన్ మెహరిన్ నటిస్తుండ డం విశేషం. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 చిత్రం సూపర్ హిట్ కావడం తో ఇప్పుడు చేస్తున్న ఎఫ్3 చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు చిత్రయూనిట్.

ప్రస్తుతం వెంకటేష్ తీస్తున్న సినిమాలన్నీ కూడా పూర్తి కావడంతో ఆయన తన తదుపరి సినిమాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. కొ న్ని సినిమాలను తెరకెక్కించాలని త్వరలోనే అనౌన్స్ చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడు. వీటిలో రీమేక్ సినిమాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయలని వెంకటేష్ భావిస్తున్నాడట. అంతే కా దు తెలుగులో డైరెక్ట్ కథలను కూడా సినిమాలను చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ తను చేయబోయే చిత్రాలతో ఎలాంటి సక్సెస్ లు సాధిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: