వచ్చే ఏడాది పవన్ నుంచి భారీ ప్రకటన...?

Sahithya
ఒకవైపు రాజకీయాలు చేసుకునే సినిమాలు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త బిజీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా రాబోయే మూడేళ్లలో కనీసం ఐదు సినిమాల్లో అయినా సరే విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా కొన్ని అంశాలకు సంబంధించి ఎన్నడూ లేనివిధంగా కష్టపడుతున్నారని వచ్చే రెండు మూడేళ్లలో సినిమాలను విడుదల చేయడమే కాకుండా రాజకీయాలకు సంబంధించి కూడా కాస్త జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారని అంటున్నారు.
అయితే వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి ఒక భారీ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు అనేది సినీ వర్గాలంటున్నాయి. ఆయన సినిమాలకు దాదాపుగా గుడ్బై చెప్పే అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నిర్మాణం మీద ఎన్నడూ లేని విధంగా ఆయన ఫోకస్ చేయవచ్చని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారని భవిష్యత్తులో ఇబ్బందులు తొలగించుకుంటూ ఆయన ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ నిర్మాతతో కూడా మాట్లాడుతున్నారు అని అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టడం మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారిన అంశం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇతర వ్యవహారాల మీద దృష్టి పెడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీ లేకపోయినా ఆయన వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అనేది మరికొంతమంది చెప్పే మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: