రామ్ చరణ్ వ్యాపారం మీద ఫోకస్...?

Sahithya
ఈ మధ్య కాలంలో మన తెలుగు హీరోలు కొంతమంది వ్యాపారాలు మీద దృష్టి పెట్టడం అలాగే ఇతర భాషల్లో ఉన్న హీరోలతో వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేయడం అలాగే సినిమాల నిర్మాణం మీద దృష్టి పెట్టడం చిన్న హీరోల సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నం చేయడం అలాగే వస్త్రాల వ్యాపారంలో కూడా ఆసక్తి చూపించడం వంటివి ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలో కొంత మంది హీరోలు ఇతర భాషల్లో ఉన్న హీరోలతో పెట్టుబడులు పెట్టేందుకు ముంబై కూడా వెళుతున్నారు అనేది కొంతమంది మాట్లాడే మాట.
తమకు ఉన్న పరిచయాల ద్వారా అక్కడ ఎక్కువగా మార్కెట్ చేయవచ్చు అనేది కొంతమంది భావిస్తున్నారని ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఎక్కువగా ఇతర భాషల్లో హీరోలతో కలిసి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని ప్రధానంగా తమిళనాడులో విజయ్ సేతుపతి తో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు అనేది ఇప్పుడు తెలుగు సినిమా లో వినపడుతున్న మాట. ప్రస్తుతం రామ్ చరణ్ రెండు మూడు సినిమాలకు సంబంధించి కాస్త ఇతర భాషల హీరోలు కూడా తీసుకుంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు అని అంతే కాకుండా అక్కడి హీరోలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
విజయ్ సేతుపతి తో కలిసి ఒక నిర్మాణ సంస్థను కూడా రామ్ చరణ్ స్థాపించే అవకాశం ఉందని దీని ద్వారా తెలుగులో అలాగే తమిళంలో కూడా సినిమాలను నిర్మించే విధంగా ప్లాన్ చేస్తున్నారని త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని దీనికి సంబంధించి పేరు ఎలా పెడితే బాగుంటుంది అనే దానిమీద చిరంజీవితో కూడా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధమైన ముందడుగు పడబోతుంది ఏంటి అనేది త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: