మెగా హీరో కోసం చిరంజీవి హెల్ప్...?

Sahithya
ఈ మధ్య కాలంలో కొంతమంది మెగా హీరోలు తమ సినిమాల విషయంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారి విషయంలో చిరంజీవి కాస్త ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ప్రధానంగా కథల ఎంపిక విషయంలో చిరంజీవి ఎక్కువగా సలహాలు ఇస్తున్నారని అంటున్నారు. చిరంజీవి మధ్య కాలంలో తన సినిమాలతో పాటు మెగా హీరోల సినిమాలకు సంబంధించి ప్రతి జాగ్రత్త కూడా తీసుకుంటూ వారి వారి సినిమాల్లో నటించే నటులకు సంబంధించి కూడా కాస్త ఎక్కువగా దృష్టి పెట్టారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చిరంజీవి తన సినిమాలతో బిజీగా ఉన్నా సరే ఎక్కడ కూడా మెగా హీరోలు ఇబ్బంది పడకుండా చూస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రధానంగా వరుణ్ తేజ్ అదేవిధంగా సాయి ధరంతేజ్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సాయి ధరంతేజ్ సోదరుడు విషయంలో కూడా ఎక్కువగా ఎక్కువగా దృష్టి పెట్టారని అంటున్నారు. ఇటీవల సాయిధరమ్ తేజ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన సినిమాల విషయంలో కాస్త తొందర పడుతున్నారని అనవసరమైన కథలన్నీ కూడా ఎంపిక చేస్తున్నారని చిరంజీవి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో అతని ఎంపిక చేసుకునే కథలకు సంబంధించి చిరంజీవి కాస్త ఎక్కువగా శ్రద్ధ పెట్టడం కాకుండా ప్రతి కథను ఎలా ఎంపిక చేసుకోవాలి ఏంటది దానికి సంబంధించి కనీసం రోజుల్లో గంట సేపైనా సరే సమయం కేటాయించి చెప్తున్నారట చిరంజీవి.
అదేవిధంగా వైష్ణవ్ తేజ్ కథల ఎంపిక విషయంలో ఒక ప్రముఖ నిర్మాత బాధ్యతలు అప్పగించారని అలాగే ఒక ప్రముఖ దర్శకుడు కూడా ఆయనకు సూచనలు సలహాలు ఇస్తున్నారని అంటున్నారు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకపోయినా తర్వాత సినిమా విషయంలో కాస్త ఇబ్బంది పడ్డారు అనేది కొంతమంది చెప్పే మాట అందుకే చిరంజీవి కాస్త ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: