ఆ డైరెక్టర్ తో రెండో పెళ్ళి..బిగ్ షాక్ ఇచ్చిన ఒక్కప్పటి హీరోయిన్..?

VUYYURU SUBHASH
రంగుల ప్రపంచం అయిన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అనేది జగమెరిగిన సత్యం. జీరో గా ఉన్న హీరో స్టార్ అవుతాడు..టాప్ హీరో అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటారు. ఇక హీరోయిన్స్ మ్యాటర్ అయితే చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమా హిట్ పడితే ఆకాశానికి ఎత్తేసే జనమే ఆదే సినిమా ఫ్లాప్ అయితే పట్టించుకోవడమే మానేస్తారు. ఇక సినిమాల పరంగా ఫ్లాప్ అయిన హీరోయిన్స్ జీవితంలో కూడా ఫ్లాప్ అయితే.. అలాంటి హీరోయిన్స్ ని ఈ సమాజం ఎలా చూస్తుందో మనకు తెలిసిందే. సూటిపోటి మాటలతో ప్రతి క్షణం వాళ్లని బాధపెడుతుంది ఈ సమాజం. అలాంటి బాధలు పడిన హీరోయిన్స్ లో ఈ పంజాబీ ముద్దుగుమ్మ సోనియా అగర్వాల్ కూడా ఒకరు.
నిజానికి ఈమె ను మనం తెలుగు తెర పై చూసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమాలో. అది కూడా బ్లాక్ బస్టర్  హిట్ అయిన సినిమాలో కావడం విశేషం. సెల్వరాఘవన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా 7/G బృందావన్ కాలనీ గుర్తుంది కదా. ఆ సినిమా లో హీరోయిన్‌గా న‌టించి సైలెంట్ లుక్స్ తో సినిమా మొత్తానికి నడిపించేసి చివరి లో  అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న భామే ఈ సోనియా అగర్వాల్. పక్కాగా చెప్పాలి అంటే 7/G బృందావన్ కాలనీ సినిమా తర్వాత  ఈ భామ కొన్ని తమిళ సినిమాలు చేసింది కానీ పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. దీంతో కొన్ని నెలలకు కనుమరుగైంది.
ఇక తనను తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడినే లవ్ చేసి పెళ్లి చేసుకుంది. కానీ ఏం లాభం  ఎంతో ప్రాణంగా  ప్రేమించి మూడుముళ్ళ బంధంతో దగ్గరైన ఈ జంట  విడాకులు తీసుకుని దూరమైంది. 2006 లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జోడీ ..ఏవో మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో 2010లో సింపుల్ గా విడిపోయారు. అయితే అప్పటి నుంచి సోనియా అగర్వాల్ ఓటరిగానే ఉంటుంది. అంటే దాదాపు పదేళ్లు ఒంటరిగానే జీవితం కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్ళి చేసుకోబోతున్నాట్లు తెలుస్తుంది.  సోనియా రెండో పెళ్లికి సిద్ధ‌మైందంటూ గ‌త కొద్ది రోజులుగా నెట్టింట  వార్త‌లు  తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఈమె త్వరలోనే ఆయన్ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి రెండో పెళ్ళి బంధాని అయిన అమ్మడు నిలబెట్టుకుంటుందా లేదా అనేది..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: