నాని పై పెరిగిపోతున్న భారం !

Seetha Sailaja
నేచురల్ స్టార్ నాని తన కెరియర్ లో ఎప్పుడు ఎదుర్కొని ఒక వింత పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కుంటున్నాడు. కరోనా పరిస్థితులలో ఓటీటీ లో విడుదల అయిన నాని నటించిన ‘వి’ ‘టక్ జగదీష్’ లు ఫెయిల్ అవ్వడంతో పాటు కరోనా పరిస్థితుల ముందు నాని నటించిన సినిమాలు అన్నీ వరస ఫెయిల్యూర్స్ కావడంతో ఇప్పుడు నాని ఖాతాలో వరసగా 5 ఫెయిల్యూర్స్ ఉన్నాయి.

ప్రస్థుత పరిస్థితులలో నాని కెరియర్ పరంగా మళ్ళీ క్రేజ్ సంపాదించుకోవాలి అంటే క్రిస్మస్ కు రాబోతున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ ఖచ్చితంగా హిట్ అయితీరాలి. నాని కెరియర్ లోనే అత్యంత భారీ సినిమాగా ఈసినిమాను తీసారు. ఇందులో నాని మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. ఈసినిమా పై నాని భారీ ఆశలు పెట్టుకున్నాడు.

అయితే ఈమూవీని ప్రమోట్ చేసే విషయంలో పూర్తి భారం నాని పై పడినట్లు తెలుస్తోంది. నాని సరైన ఫామ్ లో లేని టైంలో బాక్సాఫీస్ దగ్గర అంతగా అనుకూలంగా లేని పరిస్థితుల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజవుతోంది అన్నది వాస్తవం. ఈమూవీ . బడ్జెట్ కూడ చాల ఎక్కువ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీ బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో ఈమూవీని అత్యధిక రేట్లకు బయ్యర్లుకు అమ్ముతున్నారు.

దీనితో ఈ మూవీ బయ్యర్లు లాభపడాలి అంటే ఈమూవీకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి. ‘పుష్ప’ విడుదలైన కేవలం వారం రోజుల గ్యాప్ లో ఈమూవీ విడుదల కాబోతోంది. దీనితో ఈమూవీకి కలక్షన్స్ రాబట్టే బాధ్యత నాని పై పడింది. ఈ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కు పెద్దగా పేరులేదు. అదేవిధంగా ఈసినిమా నిర్మించిన నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కూడ కొత్తది. పేరుకు హీరోయిన్లు సాయిపల్లవి కృతి శెట్టి ఉన్నప్పటికీ ఈసినిమాకు హైక్ రావాలి అంటే అంతా నాని క్రేజ్ పైనే ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: