బన్నీ మరీ అంత చేంజ్ ఓవరా!!

P.Nishanth Kumar
అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన లుక్ చూసి అభిమానులు సైతం ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ లుక్స్ విషయానికి వస్తే తెలుగు వారికి ఎప్పుడూ తమిళ హీరోలే ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. వారు ఒక సినిమాలో ఎంతో స్టైలిష్ గా కనిపించి ప్రేక్షకులను అలరించి మరొక సినిమా లో గుర్తుపట్టలేని విధంగా డిగ్లామర్ లోకి మారిపోయి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఈ విషయంలో వారిని మించిన హీరో లు లేదంటే ఒప్పుకోవాల్సిందే.

తమిళనాట కమలహాసన్ విక్రమ్ సూర్య లాంటి హీరోలు పాత్రల కోసం ఏ విధంగా మారిపోతుంటారు అనేది మనం ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటాం. ఆ విధంగా మన హీరోలు చేయట్లేదు ఏంటి అని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన హీరోలు సిక్స్ ప్యాక్ చేయడానికి స్టైలిష్ గా తయారవడానికి ఎంతైనా కష్టపడతారు. కానీ డి గ్లామర్ పాత్రలు వేయాలంటే మాత్రం వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు సైతం కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు. వారు కూడా గ్లామర్ పాత్రలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.

అలాంటి పాత్ర లు వేయడం లో అల్లు అర్జున్ ఇప్పుడు ముందు ఉన్నాడు అని చెప్పవచ్చు. పుష్ప సినిమా కు ఆయన వేసిన డి గ్లామర్ హీరో ప్రేక్షకులను అలరిస్తుంది. గతం లో లేని విధం గా ఈ పాత్ర వేసి ప్రేక్షకులను అలరించబోతున్నారు బన్నీ. సుకుమార్ తన సినిమాలలో హీరోలను ఈ విధమైన పాత్రలో చూపించి వారి అభిమానులను కూడా ఎంతగానో సంతోషపడుతున్నారు. అయితే అల వైకుంఠపురం లో సినిమాలో అల్లు అర్జున్ స్టైలిష్ గా కనిపించి తన తదుపరి చిత్రంలో ఇలాంటి రగ్డ్ లుక్ లో కనిపించడం ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తుంది చిత్ర యూనిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: