తెలుగు లో హ్యాట్రిక్ అందుకున్న దర్శక హీరోలు వీరే!!

P.Nishanth Kumar
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒకసారి ఒక దర్శక హీరోల కాంబో సూపర్ హిట్ అయితే మరొకసారి ఆ కాంబో లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంది. అంతే కాదు రెండు సార్లు ఈ కాంబో లో సినిమా వచ్చిన తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం హీరో దర్శకుడు ఇద్దరూ కూడా సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో దర్శక హీరోలు కలసి మూడు సినిమాలు చేసిన వారి జాబితా ఇప్పుడు చూద్దాం. 

తాజాగా అఖండ సినిమాతో వారి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమాను కూడా సూపర్ హిట్ చేసుకున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను మరియు హీరో నందమూరి బాలకృష్ణ. వారి కాంబినేషన్లో సింహా లెజెండ్ సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన అఖండ చిత్రం సూపర్ హిట్ మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజమౌళి మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా ఒకదానికి మించి ఒకటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి అవి. మొదటగా వీరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రాగా ఆ తర్వాత సింహాద్రి యమదొంగ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతకు మించి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమా వీరి కాంబినేషన్ లో రాబోతుంది.

ఇక రవితేజ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు కాగా వాటిలో మూడు చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో కూడా చత్రపతి, బాహుబలి1, బాహుబలి 2 వంటి మూడు భారీ సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్ లో మూడు సినిమా లు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఆ తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా మూడు సినిమా లు వచ్చి క్లాసిక్ హిట్ లు కొట్టాయి. ఇలా ఒక హీరో ఒక దర్శకుడు తో కలిసి మూడు అంతకంటే ఎక్కువ సినిమాలు చేసి వారి కెరీర్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలను చేసిన ఘనత దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: