'అరణ్య'తో రానా ప్రయోగం వికటించింది...

VAMSI
బాహుబలి లాంటి ప్రభంజనం తర్వాత భల్లాల దేవుడిగా రానా క్రేజ్ గ్రాఫ్ అలా పెరిగిపోయింది. అంతటి ఘన విజయం తర్వాత రానా చేయబోయే ప్రతి చిత్రంపై ఫ్యాన్స్ కు లెక్కలు వేరే లెవల్ లో ఉంటాయి. అటువంటి సమయంలో ఎన్నో అంచనాల నడుమ రానా ప్రధాన పాత్రలో మన ముందుకు వచ్చిన సినిమా 'అరణ్య'. మనిషికి అడవి ఎంత ముఖ్యం.. అదే విధంగా ఆ అడవికి ఏనుగులు ఎంత అవసరం. ఏనుగులను సంరక్షించడం, వన్య ప్రాణులను రక్షిండమే ప్రధాన అంశం గా తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మరింత ఆసక్తిని నెలకొల్పింది.
అంతే కాకుండా బాహుబలి వంటి బిగ్ హిట్ కూడా ఈ సినిమాపై ప్రభావం చూపి అభిమానుల అంచనాలను మరింత పెంచింది. ప్రకృతి విలువను మానవాళికి తెలియచేసే బలమైన కథ ఉన్నప్పటికీ ఆ పదును కథనంలో కనిపించకపోవడం వలన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది . 2021 లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది. కానీ..రానా కి మాత్రం నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. లాగ్ చాలా ఎక్కువగా ఉందని, బోరింగ్ అనిపించిందని కామెంట్లు గట్టిగానే వినిపించడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అరణ్య సినిమా భారం మొత్తం రానా భుజాలపైనే పడింది, వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అప్పటికి వీలైనంత వరకు సినిమాని నిలబెట్టడంలో రానా పూర్తి న్యాయం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కమర్షియల్ ఫార్ములాకు  మాత్రమే ఫిక్స్ అయిపోకుండా..అన్ని జోనర్లను టచ్ చేస్తూ వైవిధ్య భరిత చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తూ ఉంటారు హీరో దగ్గుబాటి రానా.  ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకునే దైర్యం చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు అలాంటి వారిలో రానా పేరు ఎప్పుడూ ముందు వరసలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: