కొరటాల శివ స్టొరీ మహేష్ కు అంత నచ్చిందా...?

Sahithya
ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో టాప్ డైరెక్టర్ గా మారిన కొరటాల శివ ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీతో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి మెగా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్న కొరటాల శివ మరో మూడేళ్లు మెగా కాంపౌండ్ లో ఉండే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా మరో సినిమాను అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా వాయిదా పడే అవకాశం ఉండగా అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఇప్పుడు కొరటాల శివ మహేష్ బాబు కోసం ఒక కథ సిద్ధం చేసి పెట్టాడని ఈ కథను మహేష్ బాబుకి వినిపించగా మహేష్ బాబు వెంటనే ఆ సినిమాను మొదలు పెట్టి కేవలం మూడు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసే విధంగా కొరటాల శివను కోరుతున్నాడు అని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాను ప్లాన్ చేసాడు.
అయితే మహేష్ బాబు కొరటాల శివ తో సినిమా చేసే అవకాశం ఉండొచ్చని ప్రచారం మొదలైంది. అల్లు అర్జున్ కంటే ముందు మహేష్ బాబుతో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది నేపథ్యంలో కొరటాల శివ ఆచార్య విడుదల తర్వాత వెంటనే ఆ సినిమాను మొదలు పెట్టవచ్చని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం తెలుగు సినిమాలో కొరటాల శివ డిమాండ్ ఒక రేంజ్ లో ఉంది అనే మాట వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: