ఆల్ టైం మెగా రికార్డు ను సాధించిన చిరంజీవి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి పనులను చిరంజీవి పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమా ఫిబ్రవరి 4 వ తేదీ న థియేటర్ లలో విడుదల కాబోతుంది, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమా తో పాటు చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన  లూసిఫర్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో కూడా డిసెంబర్ నెలలో పాల్గొనబోతున్నారు, ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా తో పాటు తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా షూటింగ్ లో కూడా చిరంజీవి ఈ నెలలో పాల్గొనబోతున్నారు, ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా లో చిరంజీవి కి చెల్లెలి పాత్ర లో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూడు సినిమా లతో పాటు చిరంజీవి ఈ డిసెంబర్ నెలలో బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన పోతున్నాడు. ఇలా  ప్రపంచం లో ఒకే నెలలో అత్యధిక షూటింగ్ లు చేసిన హీరో గా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారు. ఇలా వరుస సినిమా ల్లో నటిస్తున్న చిరంజీవి స్టామినా ను చూసి కుర్ర హీరోలు సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: