పవన్ కళ్యాణ్ భారీ ప్లాన్ చేస్తున్నారా...?

Sahithya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే విషయంలో గతంలో కంటే కూడా ఇప్పుడు కూడా ఉండడం అలాగే దాదాపు ఐదు సినిమాలు లైన్ లో పెట్టడం అనేది తెలుగు సినిమా లో సంచలనం గానే ఉంది అనే మాట వాస్తవం. ఆయన ప్రస్తుతం చేసే సినిమాలకు సంబంధించి పూర్తి క్లారిటీ ఉన్నా సరే కొన్ని కొన్ని అంశాలలో కాస్త వెనుకడుగు వేస్తున్నారని భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి గత అనుభవాల దృష్ట్యా దూకుడుగా ముందుకు వెళ్లలేక పోతున్నారు అని ప్రచారం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల మీద కూడా దృష్టి పెట్టారని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మల్టీస్టారర్ సినిమాలను జాగ్రత్తగా తీసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో పూర్తి క్లారిటీ ఉన్న సరే ఫ్యూచర్ ప్రాజెక్టుకు సంబంధించి వాటి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియక పోయినా ఆయన మాత్రం ఏడాదికి రెండు సినిమాలను రాబోయే ఐదేళ్లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే 10 కథలను రెడీ చేసి పెట్టారని ఆ కథలకు సంబంధించి దర్శకుడు కూడా రెడీగా ఉన్నారని వచ్చే ఏడాది దాదాపు నాలుగు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొదలు పెట్టే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ సినిమాలు చేయకుండా ఉండటమే మంచిది అని సలహాలు కూడా కొంత మంది ఉన్నా సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదని భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి గతంలో కంటే ఇప్పుడు ఆయన రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అలాగే నటన విషయంలో కూడా కాస్త విలక్షణ పాత్ర చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: