రీతూ వర్మ కు సూపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరోతో?

praveen
గత కొన్ని రోజుల నుంచి దక్షిణాది చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్ రీతూ వర్మ సత్తా చాటుతోంది. ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతుంది.  పెళ్లిచూపులు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది రీతూ వర్మ. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంది  నాచురల్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ సినిమా.

 ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన రీతూవర్మ అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుంది. ఇక చాలా రోజుల తర్వాత ఇటీవలే మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి యువ హీరో నాగ శౌర్య తో కలిసి ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.. ఇకపోతే ప్రస్తుతం రీతూ వర్మ తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకున్నట్లు  తెలుస్తోంది. ఈ క్రమంలోనే  రీతు వర్మ మరో బంపర్ ఆఫర్ను కొట్టేసిన ట్లు తెలుస్తోంది. ఇటీవలే నాచురల్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు దర్శకుడు అనుదీప్.

 జాతి రత్నాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ కడుపుబ్బ నవ్వించాడు అని చెప్పాలి. అయితే అనుదీప్ తన రెండో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు.  ఇక ఈ స్టోరీ ని శివకార్తికేయన్ కు వినిపించగా వెంటనే ఓకే చెప్పాడట ఈ తమిళ హీరో. ఇక ఈ సినిమాని తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇలా అనుదీప్ - శివ కార్తికేయన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లో తెలుగమ్మాయి రీతువర్మ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో అఫీషియల్ ప్రకటన రాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: