నితిన్ తండ్రి వ‌ర్సెస్ సురేష్‌బాబు..!

VUYYURU SUBHASH
ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు డబ్బింగ్ , రీమేక్‌ హక్కులను దక్కించుకునేందుకు ఎప్పుడు అయినా... ఏ భాషలో అయినా పోటీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల రీమేక్ హక్కుల విషయంలో కూడా మన తెలుగు లో ఎంత డిమాండ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ... మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లాంటి వారు ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా తమిళంలో విజ‌య్ హీరో గా వచ్చి సూపర్ హిట్ అయిన క‌త్తి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇటీవల వరుసగా గోపాల గోపాల - కాటమరాయుడు - గబ్బర్ సింగ్ ఇప్పుడు వస్తున్న భీమానాయక్ ఇలా వరుసగా రీమేక్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. వెంకటేష్ దృశ్యం - దృశ్యం 2 తో పాటు నార‌ప్ప ఇలా.. తన కెరీర్లో ఎక్కువుగా రీమేక్ సినిమాల‌పై ప్రధానంగా ఆధార పడుతూ వచ్చారు.

ఇక తాజాగా తమిళంలో శింబు హీరోగా వెంకట్ ప్ర‌భు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అయిన మానాడు సినిమా రీమేక్ రైట్స్ కోసం తెలుగులో టాప్‌ నిర్మాతలు పోటీపడుతున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు, సితార ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.

అయితే ఈ సినిమా రీమేక్ / డబ్బింగ్ హక్కులు హీరో శింబు దగ్గర ఉన్నాయట. అయితే ఆయన మాత్రం తెలుగులో నేరుగా డబ్‌ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి మాత్రం ఎలాగైనా రీమేక్ రైట్స్‌ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: