అఖండ జాతర తో ఊపిరి పోసుకున్న ఊరమాస్ ట్రెండ్ !

Seetha Sailaja
ధియేటర్లు అదిరిపోయేలా హీరో భారీ డైలాగులు ఎటువంటి కొత్తదనం లేని కథ ముగ్గురు విలన్స్ ఇలాంటి ట్రెండ్ అంతా ఊర మాస్ సినిమాలకు సంబంధించింది. ప్రస్తుతతరం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడటం లేదని కథలో సహజత్వం కోరుకుంటున్నారని అనేక సినిమాల విజయం రుజువు చేసింది.

దీనితో ఊరమాస్ సినిమాలకు ఇక కాలం చెల్లిపోయింది అని అనుకున్నారు అంతా. అయితే అందరి ఊహలను తలక్రిందలు చేస్తూ ‘అఖండ’ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ చూస్తుంటే చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ఈ మూవీ పక్కా మాస్ మూవీ అని అంటూ రివ్యూలు వచ్చాయి. అయితే ఆ రివ్యూలను పట్టించుకోకుండా ఓవర్సీస్ లో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఈమూవీకి వచ్చిన కలక్షన్స్ ను చూసినవారికి ఇంకా ఊరమాస్ సినిమాలకు లైఫ్ ఉంది అని అనిపించడం సహజం.

అయితే ‘అఖండ’ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనుక మరొక కారణం ఉంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇప్పటివరకు ఒక్క పెద్ద హీరో సినిమా కూడ విడుదల కాలేదు. దీనితో సగటు ప్రేక్షకుడు పెద్ద హీరోల సినిమాల గురించి చాల ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి గ్యాప్ లో విడుదల అయిన మూవీ ‘అఖండ’ ఈ మూవీలో బోయపాటి బాలకృష్ణల మాస్ ట్రిక్స్ కు మాస్ ప్రేక్షకులే కాకుండా క్లాస్ ప్రేక్షకులు కూడ కనెక్ట్ కావడం బాలయ్య అదృష్టం.

డిసెంబర్ 17 వరకు మరొక పెద్ద సినిమా ఈ సినిమాకు పోటీగా లేదు. దీనికితోడు ఈ సినిమా బడ్జెట్ కూడ మరీ అంత భారీ స్థాయిలో లేదు. దీనితో ఈ సినిమాకు వచ్చిన టాక్ రీత్యా ఈ మూవీ బయ్యర్లకు కాసుల పంట కురవడం ఖాయం అని అంటున్నారు. ఈ మూవీకి రెండవ రోజు కూడ కలక్షన్స్ సంతృప్తి కరంగా ఉండటంతో తిరిగి సింహం బాలయ్య గర్జనలు మరికొన్ని భారీ సినిమాలలో విపరీతంగా వినిపించే ఆస్కారం కనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: