22 ఏళ్ళు పూర్తి చేసుకున్న రవితేజ క్లాసిక్ హిట్ 'నీకోసం'.. ఏకంగా ముగ్గురిని స్టార్స్ చేసింది..

Purushottham Vinay
స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, స్టార్ హీరో మాస్ మహారాజ్ రవి తేజ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ లో 1999 వ సంవత్సరం డిసెంబర్ 3న నీకోసం అనే చిత్రం తెరకెక్కి విడుదలైంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మొట్ట మొదటి చిత్రం ఇది.ఇక ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 22 ఏళ్ళు పూర్తి అయ్యింది.ఇక ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సినిమా తియ్యడానికి ముందు శ్రీను వైట్ల చాలా ఇబ్బంది పడ్డాడు.ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొత్తలో దర్శకుడు తాతినేని రామారావు తెరకెక్కించిన 'ప్రాణానికి ప్రాణం' అనే సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసాడు. ఇక ఆ సినిమా దెబ్బకి డిజాస్టర్ అయ్యింది.

ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి గల తప్పులు తెలుసుకొని చాలా జాగ్రత్తగా తన మొదటి సినిమా కోసం కథను రాసుకున్నాడు.ఇక రాంగోపాల్ వర్మ దగ్గర శ్రీను వైట్ల అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైములో అతనికి రవితేజ పరిచయమయ్యాడు. అయితే నీకోసం సినిమాకి శ్రీను వైట్ల ముందుగా రవితేజని హీరోగా అనుకోలేదట.నీకోసం సినిమాని అప్పట్లో మంచి ఫాంలో వున్న జేడీ చక్రవర్తితో చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు 'గులాబీ' సినిమాతో జేడీ ఇమేజ్ పెరిగి పోవడంతో అతని స్థాయికి శ్రీనువైట్ల సినిమా తీసేంతలా ఎదగలేదు.ఇక అప్పటికే స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారు జేడీతో వరుస సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు.

అయితే ఇక అప్పటికే శ్రీను వైట్లకి అనుకోకుండా రాజశేఖర్, సాక్షి శివానందలతో 'అపరిచితుడు' అనే సినిమా చేసే ఛాన్స్ దక్కింది. కానీ కొన్ని ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడం జరిగింది.కానీ అప్పుడు శ్రీను వైట్లకి పెరిగిన పరిచయాల కారణంగా తన దగ్గర రెడీగా ఉన్న నీకోసం కథ చేయడానికి ఓ బృందం సిద్ధం అయ్యింది.కాని అప్పటికి శ్రీను వైట్లకి కేవలం రూ.40 లక్షలు బడ్జెట్ పెట్టే నిర్మాత మాత్రమే దొరికాడు కాబట్టి..అందుకే అప్పట్లో సెకండ్ హీరోగా చేస్తున్న తన స్నేహితుడు రవితేజ ని శ్రీను ఈ సినిమాకి హీరోగా పెట్టుకున్నాడు.సినిమా పైన ఎలాంటి అంచనాలు క్రేజ్ లేవు.

కేవలం ఒక్క హీరోయిన్ మహేశ్వరీ తప్ప ఈ సినిమాలో నటించే మిగిలిన వారికి క్రేజ్ లేదు. అయినా కాని ధైర్యం చేసి ముందడుగు వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ ఒకర్ని అనుకుంటే… ఆ తర్వాత ఆర్.పి.పట్నాయక్ అనే కొత్త కుర్రాడిని తీసుకున్నారు.ఇక నీకోసం సినిమాని రూ.55 లక్షల బడ్జెట్ లో ఎలాగోలా పూర్తిచేశారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన రామోజీరావు గారు మెచ్చి రూ.80 లక్షలకి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేశారు.ఇక కట్ చేస్తే సినిమా హిట్టు.ఫుల్ రనలో నీకోసం సినిమా రూ.1 కోటి వరకు కలెక్ట్ చేసి మంచి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా హిట్ తో తరువాత శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా రవి తేజ స్టార్ హీరోగా ఆర్పీ పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అయ్యారు. ఇలా ఈ సినిమా ఇండస్ట్రీకి ముగ్గురు స్టార్స్ ని పరిచయం చేసి వారికి లైఫ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: