టాలీవుడ్ లో పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన సినిమాలివే?

VAMSI
పాలిటిక్స్ అనేది ఎపుడు కూడా ఒక తాజా కాన్సెప్ట్. న్యూస్ ని కానీ న్యూస్ పేపర్ ని కానీ కేవలం రాజకీయ వార్తలు తెలుసుకోవడానికి మాత్రమే చూసే వారి సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అంశం కావడంతో పాలిటిక్స్ ని తమ స్టోరీలకు జోడించడానికి చాలా మంది డైరెక్టర్లు ప్రయత్నిస్తుంటారు. సినీ పరిశ్రమలో నాటి నుండి నేటి వరకు రాజకీయ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. చాలా వరకు ప్రేక్షకుల మెప్పును పొంది హిట్ అందుకోగా కొన్ని మాత్రం సక్సెస్ అవ్వక పోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.
వాటిలో కొన్ని సిఎంమాలు ఒకసారి చూద్దాం.
* శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రాజకీయ నేపథ్యంలో మన ముందు వచ్చిన చిత్రం 'ఆపరేషన్ దుర్యోధన'. ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు హీరో శ్రీకాంత్. ఈ సినిమాలో అవినీతిని అలాగే గూండాగిరితో ప్రజల్ని హింసించే రాజకీయ నాయకులను ఏరివేయడమే ఆపరేషన్. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు.
 *ప్రతినిధి నారా రోహిత్ హీరోగా పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న చిత్రం ఇది.  ఈ సినిమా కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంది. రాజకీయ నాయకులలో ఉన్న అవినీతిపై పోరాడే ఒక యువకుడి కథ ఇది.
* విజయదేవరకొండ హీరోగా రాజకీయ నేపథ్యంలో వచ్చిన చిత్రం 'నోటా'. ఇందులో విజయ్ దేవరకొండ సిఎం గా కనిపిస్తారు. కథ, కథనం బాగున్నా....కొన్ని అంశాలు కనెక్ట్ కాకపోవడం, అందులోనూ ఈ సినిమా ఎక్కువగా తమిళనాడు పాలిటిక్స్ కి దగ్గరగా ఉండడంతో ఈ సినిమా ఇక్కడి వారి అంచనాలను అందుకోలేకపోయింది. కానీ హీరో నటనకు...ఇలాంటి స్టోరీ అటెంప్ట్ కు దర్శకుడికి మంచి మార్కులే పడ్డాయి.
* దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం  'నేనే రాజు నేనే మంత్రి'. ఈ సినిమా ఒక  ప్రభంజనాన్ని సృష్టించింది. రాజకీయాల్లోని వ్యూహాల చుట్టూ తిరిగే కథనంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించి కాసుల వర్షం కురిపించింది.
* ఈయన రాజకీయ నేపథ్యంలో నటించిన 'లీడర్' మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' వంటి పొలిటికల్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు సైతం విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: