బాలయ్య పవర్ మాములుగా లేదుగా ... రెండో రోజు కూడా అఖండ .... ??

GVK Writings
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తీసిన లేటెస్ట్ సినిమా అఖండ నిన్న థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ సంస్థ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేయగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. బాలయ్య ఫ్యాన్స్, అలానే తెలుగు ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పరిచిన అఖండ రిలీజ్ తరువాత మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
గతంలో బాలయ్య తో బోయపాటి శ్రీను తీసిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించేలా మరొకటి సూపర్ హిట్ కొట్టడంతో అఖండ కూడా సూపర్ హిట్ కొట్టి వారి కాంబోలో హ్యాట్రిక్ నమోదు చేస్తుందని అందరూ భావించారు. అయితే సినిమాలో మాస్, యాక్షన్ అంశాలతో పాటు రక్తపాతం ఎక్కువయిందని అలానే సినిమాలో ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలు పెద్దగా లేవని, ఇక సినిమాకి కేవలం బాలయ్య మాత్రమే ప్లస్ పాయింట్ అయ్యారని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అటు రైతుగా ఇటు అఘోరాగా ఆయన రెండు పాత్రల్లో యాక్షన్ నభూతో నభవిష్యత్ అని ప్రేక్షకాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఆ విధంగా పర్వాలేదనిపించే టాక్ మాత్రమే అందుకున్న అఖండ మొదటి రోజు మంచి కలెక్షన్ అందుకోగా బాలయ్య మాస్ పవర్ తో రెండో రోజు కూడా చాలా సెంటర్స్ లో మూవీ బాగానే కలెక్షన్ సాగిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో అఖండ మరింతగా రాబట్టే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తంగా టాక్ పరంగా ఢీలా పడ్డ అఖండ రాబోయే రోజుల్లో ఎంత మేర కలెక్షన్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు టాలీవుడ్ వర్గాల వారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: