శాతకర్ణి, వకీల్‌సాబ్ రికార్డులు బ్రేక్ చేసిన అఖండ..!
ఇక తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ రు. 15 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. గ్రాస్ వసూళ్లు రు. 23 కోట్లు దాటాయనే అంటున్నారు. ఇక బాలయ్య కెరీర్ లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా ఉన్న గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ డే రు. 9 కోట్ల షేర్ అంటే రు. 9.76 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు ఆ సినిమా ను వెనక్కు నెట్టేస్తూ అఖండ ఫస్ట్ ప్లేసులోకి దూసుకు పోయింది.
బాలయ్య కెరీర్ లో తొలి రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా అఖండ రికార్డులు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కు రావాలంటే ఈ సినిమా రు. 49 కోట్ల షేర్ రాబట్టాలి. అంటే మరో రు. 33 కోట్ల షేర్ ఏపీ, తెలంగాణలో అఖండ వసూలు చేయాలి. అయితే పుష్ప వచ్చే వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో అఖండ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో ? చూడాలి.
ఇక అమెరికా లో కూడా అఖండ ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్లు (దాదాపు 2.75 కోట్లు) వసూలు చేసింది. ఇది వకీల్ సాబ్ 3 లక్షల డాలర్లు, లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్లను కూడా బ్రేక్ చేసేసింది. ఏదేమైనా ఓవర్సీస్ లో అఖండ జాతర అయితే మామూలుగా లేదనే చెప్పాలి.