ఇక థియేటర్లు మూసుకోవాల్సిందేనా !?

Vimalatha
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న టికెట్ రేట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విడుదలైన 'అఖండ' చిత్రం మొదటి రోజే 40 కోట్లు సంపాదించాల్సి ఉండగా, ఆంధ్రాలో టికెట్ రేట్లతో పాటు పలు సమస్యల కారణంగా మేకర్స్ జేబుకు భారీగానే చిల్లు పడింది. అక్కడ బెనిఫిట్ షోలు, నైట్ షోలు క్యాన్సిల్ చేస్తున్నారని నందమూరి అభిమానులు డైర్ అవుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇక డిస్ట్రిబ్యూటర్లు అక్కడ థియేటర్లు మూసుకోక తప్పదు అన్పిస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు సినిమా ప్రముఖులు సైతం ఏపీ గవర్నమెంటు వ్యవహరిస్తున్న తీరును చూసి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ హితవు పలుకుతున్నారు.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ను ప్రవేశపెట్టే ఏపీ సినిమా (నియంత్రణ) బిల్లు 2021ని రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించడంతో బిల్లును పాస్ చేశారు. ఈ బిల్లుపై మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టిక్కెట్ల బుకింగ్‌ ను ఆన్‌లైన్‌ లో ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం వీలు కల్పిస్తుందని చెప్పారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టిక్కెట్ బుకింగ్ కోసం పోర్టల్‌ను నిర్వహిస్తుంది అని ఆయన అన్నారు. ఇది విమానాలు, రైళ్లు మరియు బస్సులకు టికెట్ బుకింగ్ లాగా ఉంటుందని, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంతో తాజాగా విడుదలైన సినిమాల టిక్కెట్‌ ధరను పెంచే కొంత మంది దోపిడీని కూడా నిరోధించగలదని మంత్రి అన్నారు. “ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ షోల సంఖ్య, టిక్కెట్ ధరను నియంత్రిస్తుంది. రోజుకు నాలుగు షోలు మాత్రమే ఉంటాయి. టిక్కెట్ ధర మారదు. అనుమతి లేకుండా ఎవరైనా అదనపు షోలు లేదా బెనిఫిట్ షోలు నిర్వహించే అవకాశం ఉండదు" అని అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: